|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌ బిర్యానీకి ఫిదా అయిన మిస్ వరల్డ్ 2025 విన్నర్‌ ఓపల్ సుచాత.. సినిమాల్లో నటించేందుకు సై

Published: 01-06-2025, 6:53 AM
హైదరాబాద్‌ బిర్యానీకి ఫిదా అయిన మిస్ వరల్డ్ 2025 విన్నర్‌ ఓపల్ సుచాత.. సినిమాల్లో నటించేందుకు సై

2025 మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఓపల్ సుచాత, హైదరాబాద్‌లో తన అనుభవాలను పంచుకుంది. హైదరాబాద్ బిర్యానీ ఆమెకు ఎంతో నచ్చింది. బాలీవుడ్‌లో నటించాలనే ఆమె కోరికను ఆమె వ్యక్తం చేసింది.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 గా ఓపల్ సుచాత ఎంపిక

2

హైదరాబాద్ బిర్యానీ ఆమెకు ఎంతో ప్రీతికరమని వెల్లడి

4

తెలంగాణ సంస్కృతి, ఆహారం, ప్రజలను ఆమె ప్రశంసించారు

మిస్ వరల్డ్ 2025 విజయం

2025 మిస్ వరల్డ్ ఒపాల్ సుచాత: శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 2025 మిస్ వరల్డ్ (Miss World 2025) ఫైనల్‌ ఈవెంట్‌ జరిగింది. మిస్ వరల్డ్ 2025 కిరీటం థాయిలాండ్‌కు చెందిన 21 ఏళ్ల ఓపల్‌ సుచాత (Opal Suchata Chuangsri) సొంతం చేసుకున్నారు.

మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత  ఓపల్‌ సుచాత మీడియాతో మాట్లాడి, తన ఫ్యూచర్‌ ప్లాన్‌ గురించి తన అభిప్రాయం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు చాలా ఇష్టమని, అవకాశం వస్తే హిందీ సినిమాల్లో నటించడానికి రెడీ అని సుచాత చెప్పడం విశేషం.

మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌ సుచాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా అందరు అమ్మాయిల ప్లేస్‌మెంట్‌లను ప్రకటిస్తున్నప్పుడు, నన్ను విజేతగా ప్రకటించినప్పుడు కూడా నాకు నమ్మశక్యం కాలేదు.

నేను చాలా అయోమయంలో పడ్డాను, ఎందుకంటే ఇదంతా నిజమేనా అనిపించింది. నేను, నా దేశం 72 సంవత్సరాలుగా మిస్ వరల్డ్ కిరీటం కోసం ఎదురు చూస్తున్నాం. మొదటి కిరీటాన్ని ఇంటికి తీసుకురావడం గౌరవప్రదం.

హైదరాబాద్ అనుభవం

నాకు కిరీటం పెట్టిన క్షణంలో నేను నా కుటుంబం, నా ప్రజలు, నా టీమ్‌ గురించి మాత్రమే ఆలోచించాను. ఈ కిరీటాన్ని థాయిలాండ్‌కు తీసుకెళ్లడానికి వెయింట్‌ చేయలేకపోతున్నా’ అని తెలిపారు.

ఆమె తన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ గురించి కూడా మాట్లాడుతూ, ‘నేను నా లక్ష్యాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా, అదే బ్రెస్ట్ క్యాన్సర్. మిస్ వరల్డ్‌లో ఉండటం వల్ల చాలా మంది నా బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉంది.

ఈ లక్ష్యంతోనే ప్రజలకు అవగాహన కల్పించడానికి పని చేస్తున్నాను. మిస్ వరల్డ్ టైటిల్‌తో భవిష్యత్తులో నా పనిపై మరింత ప్రభావం చూపుతుంది, ఇదే కాదు ఇతర ప్రాజెక్ట్‌లకు కూడా సహాయం చేయగలనని  నమ్ముతున్నా’ అని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ మీడియాతో ముచ్చటించిన ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని, హైదరాబాద్‌ నగరంపై ప్రశంసలు కురిపించింది. తెలంగాణ టూరిజం చాలా బాగా ఈ కార్యక్రమం నిర్వహించిందని, ఒక బెస్ట్ మెమొరీగా ఇది గుర్తిండిపోతుందని, ఇక్కడి కల్చర్‌, దుస్తులు, ఫుడ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ అందమైన ప్రదేశాలను చూసి ఎంజాయ్‌ చేశామని, ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమగా ఉంటారని వెల్లడించింది.

సినిమాల్లో అడుగుపెట్టే ఆలోచన

ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. తనక హైదరాబాద్‌ బిర్యానీ బాగా నచ్చిందని, ఇక్కడి ఫుడ్‌ని బాగా ఎంజాయ్‌ చేసినట్టు తెలిపింది. తాను అవకాశం ఉంటే మళ్లీ హైదరాబాద్‌కి వస్తానని ఆమె వెల్లడించడం విశేషం.

2025 మిస్ వరల్డ్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. భారతదేశం తరపున మోడల్ నందిని గుప్తా పాల్గొంది. అయితే, ఆమె మిస్ వరల్డ్ 2025 టైటిల్ రేసులో టాప్ 20లో మాత్రమే చోటు దక్కించుకుంది. టాప్‌ 8లోనే ఎలిమినేట్‌ అయ్యింది.

72వ మిస్ వరల్డ్ ఫైనల్‌కు స్టెఫానీ డెల్ వాలే (2016 మిస్ వరల్డ్) ఆతిథ్యం ఇచ్చారు. ఆమె ఈ కార్యక్రమంలో సాంప్రదాయ భారతీయ లెహంగా ధరించారు. ఈ కార్యక్రమంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఈషాన్ ఖట్టర్ కూడా డాన్స్ పర్‌ఫర్మెన్స్ తో అదరగొట్టారు.  72వ మిస్ వరల్డ్ పోటీలో సోనూ సూద్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు, ఆయనకు హ్యుమానిటేరియన్ అవార్డు కూడా లభించింది.

ఆయనతోపాటు నమ్రత శిరోద్కర్, రానా దగ్గుబాటి, మనుషీ చిల్లర్‌ వంటి వారు జ్యూరీలో ఉన్నారు. ఇక ఈ ఈవెంట్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి, మెగాస్టార్‌ చిరంజీవి సతీసమేతంగా హాజరు కావడం విశేషం.

హైదరాబాద్‌ సందర్శనం ఓపల్‌కు మరపురాని అనుభవంగా మారింది. బిర్యానీతో పాటు, తెలంగాణ సంస్కృతి ఆమెను ఆకట్టుకుంది. బాలీవుడ్ ప్రస్తావన ఆమె భవిష్యత్తులో సినిమాల్లో కనిపించే అవకాశాన్ని సూచిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.