|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్‌ వరల్డ్ 2025 క్వార్టర్‌ ఫైనల్‌కి 48 మంది అందగత్తెలు.. భారతీయుల ఆశలు పదిలం

Published: 20-05-2025, 1:23 AM
మిస్‌ వరల్డ్ 2025 క్వార్టర్‌ ఫైనల్‌కి 48 మంది అందగత్తెలు.. భారతీయుల ఆశలు పదిలం

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది అందగత్తెలు ఎంపికయ్యారు. భారత ప్రతినిధి నందిని గుప్తా కూడా ఈ దశకు ఎంపిక కావడం వినోద ప్రియులను ఉత్సాహపరిచింది.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది అందగత్తెలు ఎంపికయ్యారు.

2

నందిని గుప్తా క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపికై భారతీయుల ఆశలను పెంచింది.

4

మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది.

క్వార్టర్ ఫైనల్స్ ఎంపిక

హైదరాబాద్‌ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్‌ వరల్డ్ 2025 పోటీలు సందడిగా మారాయి. మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తెలంగాణలోని అందమైన ప్రదేశాలను, టూరిస్ట్ ఏరియాలను సందర్శించి ప్రపంచానికి మన తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. ఇప్పటికే చార్మినార్‌, సచివాలయం, యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్‌,  నాగార్జున సాగర్‌ బుద్ధవనం, పిల్లల మర్రి వంటి లొకేషన్లని అందగత్తెలు సందర్శించిన విషయం తెలిసిందే.

దాదాపు ఇరవై రోజులుగా జరిగే ఈ 72వ మిస్‌ వరల్డ్ పోటీల్లో ఇప్పుడు కీలక మలుపుకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 109 దేశాల నుంచి సుందరీ మణులు పాల్గొన్నారు. మన దేశం నుంచి రాజస్తాన్‌కి చెందిన నందిని గుప్తా పార్టిసిపేట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

నందిని గుప్తా ఎంపిక

అయితే ఇప్పుడు క్వార్టర్‌ ఫైనల్‌ కి ఎంపిక కార్యక్రమం జరుగుతుందట. సోమవారం ఒక దశ ఫిల్టర్‌ జరిగిందని తెలుస్తుంది. ఇందులో సుమారు 48 మందిని క్వార్టర్‌ ఫైనల్‌కి ఎంపిక చేశారట. అయితే ఈ ప్రాసెస్‌ ఇంకా పూర్తి కాలేదని, మంగళవారం, బుధవారం కూడా కొనసాగుతుందని తెలుస్తుంది. బుధవారంతో క్వార్టర్‌ ఫైనల్‌కి వెళ్లాల్సిన కంటెస్టెంట్లని ఫైనల్‌ చేస్తారు.

ఇందులో అమెరికా కరేబియన్‌, ఆఫ్రికా, యూరప్‌, ఆసియా ఓషియానా కాంటినెంటల్‌ క్లస్టర్ల నుంచి వివిధ అంశాల వారిగా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నిర్వహించిన టాలెంట్‌ కాంపిటీషన్‌ సెకండ్‌ రౌండ్‌ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌కి 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్‌, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ప్రతిభని నిరూపించుకోవాల్సి ఉన్నట్టు మిస్‌ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు.

భారతీయుల ఆశలు

టీ హబ్‌లో మంగళవారం, బుధవారం ఈ కాంటినెంటల్‌ ఫినాలేలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో ఎంపికైన వారు క్వార్టర్‌ ఫైనల్‌కి చేరతారు. అయితే ఇప్పటి వరకు చేసిన ఫిల్టర్‌లో మన ఇండియా నుంచి పోటీల్లో ఉన్న నందిని గుప్తా ఎంపికైనట్టు తెలుస్తుంది. దీంతో ఇండియాకి ఆశలు మిగిలే ఉన్నాయి. ఇందులో మరో మూడు దశల్లో ఫిల్టర్‌ జరుగుతుంది. ఫైనల్‌గా మే 31న గ్రాండ్‌ ఫినాలే ఉంటుంది. మరి ఈ సారి ఇండియాకి టైటిల్‌ దక్కుతుందా? నందిని మన 130 కోట్ల మంది ప్రజల ఆశలను నేరవేరుస్తుందా? అనేది చూడాలి.

నందిని గుప్తా క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపిక కావడంతో భారతదేశానికి గెలుపు ఆశలు పెరిగాయి. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.