
హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల టాలెంట్ రౌండ్ ఫైనల్ కు 24 మంది సుందరీమణులు ఎంపికయ్యారు. ఇండియా నుండి నందిని గుప్తా కూడా ఎంపిక కావడం గర్వకారణం. ఈ పోటీలలో వారి ప్రతిభను చూద్దాం.
Key Points
మిస్ వరల్డ్ 2025 టాలెంట్ రౌండ్ ఫైనల్ కు 24 మంది అందగత్తెలు ఎంపికయ్యారు.
భారతదేశం నుండి నందిని గుప్తా ఫైనల్ కు ఎంపిక కావడం విశేషం.
మే 23న టాలెంట్ ఛాలెంజ్ ఫైనల్ జరుగనుంది.
గ్రాండ్ ఫైనల్ లో టాప్ 10 లోకి చేరే అవకాశం ఉన్న 24 మంది అందగత్తెలు ఎంపికయ్యారు.
టాలెంట్ రౌండ్ ఫైనల్స్
మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికైంది. ఇది మన తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పొచ్చు. సుమారు 20 రోజులపాటు జరిగే ఈ ప్రపంచ అందగత్తెల పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. అందులో భాగంగా లేటెస్ట్ గా కీలక ఘట్టానికి చోటు చేసుకున్నాయి. ఫైనల్‌కి చేరుకున్న జాబితాని విడుదల చేశారు మిస్ వరల్డ్ నిర్వాహకులు. ఇందులో మన ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా ఎంపిక కావడం విశేషం.
దాదాపు వందకు పైగా ప్రపంచ వ్యాప్తంగా సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనగా, క్వార్టర్ ఫైనల్‌కి 48 మందిని ఎంపిక అయ్యారు. వారి నుంచి మళ్లీ ఫిల్టర్ చేయగా, ఫైనల్‌కి 24 మందిని ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తాజాగా అధికారికంగా ప్రకటించారు. `దాదాపు వంద మంది పోటీదారులు తమ ప్రతిభని, అభిరుచిని, అంకితభావంతో ప్రదర్శించారు. పోటీలకు శక్తిని తీసుకొచ్చారు.
ఒక రౌండ్ ఆడిషన్లు, అత్యంత పోటీ నెలకొన్న రెండవ రౌండవ కట్ తర్వాత 24 మంది అత్యుత్తమ సుందరీమణులను టాలెంట్ ఛాలెంజ్ ఫైనల్‌కి స్థానాన్ని సంపాదించుకున్నారు.
నందిని గుప్తా ఎంపిక
మళ్లీ వీరు మే 23న మరోసారి ప్రపంచం తరఫున ప్రదర్శన ఇవ్వడానికి వేదికపైకి రాబోతున్నారు. వీరు టాప్ 10 స్థానాల్లోకి చేరుకుంటారు. ఫైనలిస్ట్ లు అందరికి అభినందనలు. టాలెంట్ ఫైనల్‌కి శుభాకాంక్షలు` అని వెల్లడించింది.
వీరిలో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతోపాటు అమెరికా, నైజీరియా, మాల్టా, ఇండోనేషియా, ఈస్తోనియా, బ్రెజిల్, నెదర్లాండ్, చెక్ రిపబ్లిక్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, కామెరూన్, పోలాండ్, ఫిలిప్పిన్స్, ఇటలి, త్రినిడాడ్ అండ్ టోబాగో, జర్మనీ, కేమాన్ ఐలాండ్, వేల్స్, జమైకా, ఐర్లాండ్, ఈథోఫియా, కెన్యా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ టాలెంట్ ఫైనల్‌కి ఎంపికయ్యారు. వీరిని మరో రెండు దశల్లో ఫిల్టర్ జరుగుతుంది. గ్రాండ్ ఫైనల్‌కి పది మందిని ఎంపిక చేస్తారని తెలుస్తుంది.
మే 23న ఫైనల్
మే 12న హైదరాబాద్‌లో ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పోటీలను నిర్వహిస్తుంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ అంతటా తిరిగి టూరిస్ట్ ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేశారు.
ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్ చేశారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన గ్రాండ్ ఫైనల్ జరగబోతుంది. విన్నర్ ఎవరో ఆ రోజు తేలబోతుంది. ఇందులో ఒక టైటిల్ విన్నర్, ఇద్దరు రన్నరప్‌లను ఎంపిక చేస్తారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ లో అంతిమ దశకు చేరుకున్నాయి. 24 మంది అందగత్తెలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. గ్రాండ్ ఫైనల్ లో విజేత ఎవరో చూడాలని ఎదురుచూద్దాం.


