|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్టీరియస్ మూవీ రివ్యూ: థ్రిల్లర్, హర్రర్ కలగలిపిన ఊహించని ట్విస్ట్‌లు!

Updated: 19-12-2025, 9:29 AM
మిస్టీరియస్ మూవీ రివ్యూ: థ్రిల్లర్, హర్రర్ కలగలిపిన ఊహించని ట్విస్ట్‌లు!
  • మిస్టీరియస్: సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ అంశాలతో తెరకెక్కిన చిత్రం.
  • కొండపూర్ SI రాంఖీ మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే కథ.
  • డైరెక్టర్ కథను నడుపుతూనే ట్విస్ట్‌లు వచ్చేలా ప్లాన్ చేశారు.
  • క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపు ఆడియన్స్‌ను షాక్ చేస్తుంది.

సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టీరియస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మానందం ప్రమోషన్స్‌తో మరింత హైప్ పెరిగింది. ఈ రివ్యూలో సినిమా కథాకథనాలు, దర్శకత్వ ప్రతిభ, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో వివరంగా తెలుసుకుందాం.

కథాంశం: మిస్సింగ్ కేసు, ఊహించని మలుపులు

ఈ మధ్య కాలంలో పాజిటివ్ వైబ్ వచ్చిన చిన్న సినిమాల్లో ‘మిస్టీరియస్’ ఒకటి. సస్పెన్స్, థ్రిల్లర్‌ స్టోరీతో వస్తుందని ప్రమోషనల్ కంటెంట్‌తో తెలిసిపోయింది. దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ పెరిగింది. అలాంటి మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ : కొండపూర్ SI రాంఖీ / రామ్ కుమార్ (అబిద్ భూషణ్) మిస్ అవుతాడు. ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ACP ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) అతని భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్) ను విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్ – శిల్ప లకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు వచ్చింది? అసలు SI రాంఖీని ఎవరు చంపారు? అనే ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో సినిమాలో చూపించారు.

విశ్లేషణ : సినిమా చూస్తున్నంత సేపు… మనం రెగ్యులర్ లైఫ్‌లో వచ్చే కొన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. అలాంటి కథకే కొన్ని ట్విస్ట్‌లు ఆధ్యాంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి, కొన్ని జాగ్రత్తలు తీసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నట్టు అర్థమైపోతుంది.

విశ్లేషణ: దర్శకత్వం, పాత్రల పరిచయం

సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి.. డైరెక్టర్ పాత్రల పరిచయం విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా… డైరెక్టర్ మెయిన్ ప్లాట్‌కి వెళ్లిపోయాడు. ఇటు కథను రన్ చేస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ.. వెను వెంటనే ట్విస్ట్‌లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్‌కు అసలు కిల్లర్ ఎవరూ అనే క్వశ్చన్ మార్క్ క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ఆడియన్‌ను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత వరకు సక్సెస్ అయినట్టే.

ఇంటర్వెల్‌లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కథను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకుళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు సస్పెన్స్, థ్రిల్లర్‌ను ఫీల్ అయ్యే ఆడియన్స్‌కు సెకండాఫ్‌లో ఉండే హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్… సినిమాను మలుపుతిప్పుతుంది. అప్పటి వరకు కిల్లర్ వీరే అని అనుకునే ఆడియన్స్ కూడా షాక్ అవుతారు.

సినిమాలో మూడు పాటలు పెట్టాడు డైరెక్టర్. ఆ మూడు పాటలు కూడా సినిమాకి సరిగ్గా సెట్ అయ్యే టైంకి పెట్టడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ పాటలకు మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు ML రాజా. అయితే, కథ వరకు అంతా బానే ఉన్నా.. నటీనటుల విషయంలో డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుండేది. అంటే.. ఇప్పుడున్న నటీనటులు అంత తెలిసిన ఫేసులు కాకపోవడం ఓ మైనస్ అని చెప్పొచ్చు.

సినిమాలోని ట్విస్ట్‌లు, హర్రర్ ఎలిమెంట్స్

నటీనటుల విషయానికి వస్తే.. దాదాపు అందరూ బాగా చేశారు. మెయిన్ లీడ్‌లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ అద్భుతంగా చేశారు. సీనియర్ పోలీస్‌గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళికి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్‌ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బానే చేశాడు.

ఇక మ్యూజిక్ ML రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫర్‌గా చేసిన పరవస్తు దేవేంద్ర సూరికి మంచి మార్కులు వేయొచ్చు. అయితే.. ఇదే సూరి ఎడిటర్‌గా కూడా ఈ మూవీకి వర్క్ చేశాడు. ఈ ఎడిటింగ్ విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి.

బాటమ్ లైన్ – ‘మిస్టీరియస్’ మూవీ మిస్ చేయకుండా ఓ సారి చూడాల్సిన మూవీ.

మొత్తంగా, మిస్టీరియస్ చిత్రం అనేక ట్విస్ట్‌లు, సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించడంలో విజయం సాధించారు. థ్రిల్లర్, హర్రర్ ప్రియులకు ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.