|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దోమతెరతో అసెంబ్లీలో ఎమ్మెల్యే ధర్నా! ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్!

Published: 02-04-2026, 8:35 AM
దోమతెరతో అసెంబ్లీలో ఎమ్మెల్యే ధర్నా! ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్!
  • దోమల సమస్యపై నిరసన తెలుపుతూ ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
  • దోమల తీవ్రతతో ప్రజలు హైదరాబాద్ విడిచి వెళ్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన.
  • కాంగ్రెస్ ప్రభుత్వం దోమల నియంత్రణపై శ్రద్ధ చూపడం లేదని విమర్శ.
  • గతంలో డ్రోన్లతో దోమల నివారణకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేసిన సుధీర్ రెడ్డి.

హైదరాబాద్‌లో దోమల బెడద తీవ్రంగా ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దోమతెర ధరించి ఫాగింగ్ మెషీన్‌తో అసెంబ్లీకి చేరుకున్నారు.

దోమల సమస్యపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరసన

దోమల నియంత్రణ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిసరన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్‌ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని మార్షల్స్‌ అడ్డుకోగా.. వారిని ప్రతిఘటించారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడివని ప్రశ్నించారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల తీవ్రతకు ప్రజలు హైదరాబాద్‌ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. నగరంలో రోజురోజుకు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దోమల నియంత్రణపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జంటనగరాల్లోని చెరువుల్లో గుర్రపుడెక్క ఆకు అధికంగా పేరుకుపోవడంతో…. వాటిలో దోమలు విస్తృతంగా పెరుగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వంపై సుధీర్ రెడ్డి ఆగ్రహం

ఉదయం మరియు సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళ్లే ప్రజలు దోమల కారణంగా మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వస్తాయేమోనని భయపడుతున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి చెప్పారు. చాలా మంది వాకింగ్‌కు రావడానికి వెనుకాడుతున్నారని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో గుర్రపుడెక్క ఆకు పేరుకుపోకుండా డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుని విజయవంతం చేశామని చెప్పారు. అలాగే దోమల లార్వాను నియంత్రించేందుకు గంబూజియా జాతి చేప పిల్లలను చెరువుల్లో వదిలి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. డ్రోన్ సాంకేతికతతో చెరువు మధ్య ప్రాంతాల్లో కూడా మందులు పిచికారీ చేయడం జరిగిందని చెప్పారు.

గతంలో తీసుకున్న చర్యలను గుర్తు చేసిన ఎమ్మెల్యే

కానీ ప్రస్తుత ప్రభుత్వం… ప్రజా ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకుండా, చెరువుల్లో పేరుకుపోతున్న గుర్రపుడెక్క ఆకును తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి…. తక్షణ చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి కోరారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ప్రభుత్వం తక్షణమే స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.