|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్: 2500 మందితో వందేమాతరం సెలబ్రేషన్స్! రిపబ్లిక్ డేకి గ్రాండ్ ట్రీట్!

Published: 19-01-2026, 4:15 AM
కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్: 2500 మందితో వందేమాతరం సెలబ్రేషన్స్! రిపబ్లిక్ డేకి గ్రాండ్ ట్రీట్!
  • కీరవాణి బృందం వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సంగీతం అందించనున్నారు.
  • జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2500 మంది కళాకారులతో కీరవాణి ప్రదర్శన.
  • కీరవాణితో పాటు గీత రచయిత సుభాష్ సెహగల్, వ్యాఖ్యాత అనుపమ్ ఖేర్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
  • వందేమాతరం పాట 1887లో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతంలో స్వరపరిచారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణికి గొప్ప అవకాశం లభించింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం పరేడ్‌కు ఆయన సంగీతం అందించనున్నారు.

వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు

MM Keeravani:ఆస్కార్ గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani). ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా ప్రకటిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు ఈ అద్భుతాన్ని తిలకించడానికి జనవరి 26 వరకు ఎదురుచూడాల్సిందే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. భారత జాతీయ గీతం అయిన వందేమాతరం ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో 150 సంవత్సరాల వందేమాతరంపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎంఎం కీరవాణి తన బృందంతో కలిసి పరేడ్ కి ప్రత్యేకమైన మ్యూజిక్ ను అందించబోతున్నారు.

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా.. “ప్రియమైన వారందరికీ.. వందేమాతరం.. ఐకానిక్ పాట వందేమాతరం 150వ వార్షికోత్సవ సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ కి సంగీతం సమకూర్చడం నేను మరింత గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గొప్ప ప్రదర్శనలో భారతదేశం మొత్తం ప్రసిద్ధి చెందిన 2500 మంది కళాకారులు పాల్గొనబోతున్నారు. మన దేశం యొక్క స్ఫూర్తిని జరుపుకోవడానికి మనం కచ్చితంగా వేచి ఉండాల్సిన సమయం వచ్చేసింది” అంటూ తెలిపారు ఎం ఎం కీరవాణి.

మొత్తానికైతే 150వ వార్షికోత్సవ సందర్భంగా జరిగే పరేడ్ కి ప్రత్యేక సంగీతాన్ని అందించడానికి సిద్ధం అయ్యారు ఎం.ఎం. కీరవాణి. ఇకపోతే ఈ బృందంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, గీతా రచయిత సుభాష్ సెహగల్ , వ్యాఖ్యాత అనుపమ్ ఖేర్ కొరియోగ్రాఫర్ సంతోష్ నాయర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాన్ ఇండియా బ్యాండ్ ప్రదర్శనలు, ఐసిసిఆర్ ప్రత్యేక ప్రదర్శనలతో పాటు వందేమాతరం జాతీయ పాట యొక్క చారిత్రక ప్రాముఖ్యత పై దృష్టి సారించనున్నారు.

కీరవాణి సంగీత దర్శకత్వం, 2500 మంది కళాకారులు

వందేమాతరం జాతీయగీతం విషయానికి వస్తే.. 1887లో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతంలో స్వరపరిచిన ఈ జాతీయ గీతం ఈ ఏడాదితో 150 వసంతాలు పూర్తి చేసుకుంది. బ్రిటిష్ అహింస నుండి భారతదేశం స్వాతంత్ర ఉద్యమం చేపట్టినప్పుడు ఆ ఉద్యమంలో రణ నినాదంగా ఉపయోగపడింది అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాటను జాతీయగీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక ప్రదర్శన

On the occasion of the 150th anniversary of the iconic song Vande Mataram, I feel deeply honoured and privileged to have composed the music for the 26th January Republic Day Parade, under the aegis of the Ministry of Culture. This grand presentation will…

— mmkeeravaani (@mmkeeravaani) January 19, 2026

మొత్తానికి కీరవాణి తన బృందంతో కలిసి వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక సంగీతం అందించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.