|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వారణాసి మూవీలో మహేష్ బాబుతో దీపికా పదుకొనే! రాజమౌళి సంచలనం!

Published: 24-01-2026, 7:35 AM
షాకింగ్: వారణాసి మూవీలో మహేష్ బాబుతో దీపికా పదుకొనే! రాజమౌళి సంచలనం!
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రం 2027లో విడుదల కానుంది.
  • ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనుండగా, దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించనుంది.
  • ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కుంభగా కనిపించనున్నారు.
  • మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు మరో నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

వారణాసి మూవీ: రాజమౌళి ప్లాన్స్!

Varanasi movie: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం “వారణాసి”(Varanasi). ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక బాలీవుడ్ హీరోయిన్ సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మందాకిని అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి .అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేను(Deepika Padukone) సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం కోసం ఈమెను సంప్రదించగా దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

దీపికా పదుకొనే ఎంట్రీ.. పాత్ర వివరాలు

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా దీపిక పదుకొనే కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక విలన్ పాత్రలో ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈయన కుంభ పాత్రలో కనిపించబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.   ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరొక ఆరు ఏడు నెలలలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కాకుండా ఈయన మరో నాలుగు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

విలన్ గా పృథ్వీరాజ్.. ఇతర నటులు

ఏది ఏమైనా రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా అంటేనే ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియాతో పలు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని షో యు బ్యానర్ పై ఎస్ ఎస్ కార్తికేయ, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తుంది.

మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.