
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెలుగు దర్శకుడు సీహెచ్. క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘మా వందే’ టైటిల్ రిలీజ్ చేశారు. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది.
Key Points
మోదీ బయోపిక్ టైటిల్ 'మా వందే' గా ప్రకటన
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో
తెలుగు దర్శకుడు సీహెచ్. క్రాంతి కుమార్ దర్శకత్వం
టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు
‘మా వందే’ బయోపిక్ విడుదల
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన బయోపిక్‌ని ప్రకటించారు. ‘మా వందే’ పేరుతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం.
నటీనటులు మరియు టెక్నీషియన్స్
మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. ఈ సినిమాలో మోదీగా పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు సీహెచ్.క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు.
ప్రస్తుతానికైతే ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో ‘ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది’ అని రాసుకొచ్చారు. అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ తీయబోతున్నారా అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని బహుశా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అయితే 2019లోనే ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్ అనమాట.
సినిమా విశేషాలు
మొత్తంగా, ‘మా వందే’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మోదీ జీవితంపై మరో బయోపిక్‌గా ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది.


