
📌 Key Points
- కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించారు.
- సంజు ఆటతీరును ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు మోడీ పిలుపునిచ్చారు.
- ప్రతి కార్యకర్త ఇంటింటికీ తిరిగి బీజేపీని గెలిపించాలని మోడీ సూచించారు.
- ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ సంజు శాంసన్‌ను ప్రశంసిస్తూ, ఆయన ఆటతీరును ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మోడీ పిలుపునిచ్చారు.
సంజు శాంసన్‌పై మోడీ ప్రశంసల వర్షం
కేరళం అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ నేపథ్యంలో బడా నేతలందరూ ఆ రాష్ట్రంలో పర్యటించి, ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా భారత వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు వర్షం కురిపించారు మోడీ.
బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం
భారత క్రికెటర్ సంజు శాంసన్ లాగా ముందుకు వెళ్లాలని బీజేపీ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. సంజు శాంసన్ ఆట తీరును ప్రశంసించారు. వరల్డ్ కప్ నాకౌట్ లో సంజు శాంసన్ చెలరేగి ఆడాడని గుర్తు చేశారు. అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయని ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి క్రీడాకారుడికి ఈ లక్షణాలు ఉండాల్సిందేనని.. అప్పుడే విజయం మన ముంగిటకు వస్తుందని తెలిపారు.
కేరళ ఎన్నికల తేదీలు, ఫలితాల వెల్లడి
భారత జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడని, సంజు కూడా అలాగే వ్యవహరించడానికి వెల్లడించారు. అదే సమయంలో ఓటింగ్ రోజున కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటిని చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మీ అంకితభావం అత్యంత ముఖ్యమన్నారు. విజయం కోసం అదనంగా పనిచేయాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. సంజు తరహాలోనే పనిచేసి, పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా కేరళం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9వ తేదీన జరుగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఇది ఇలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసేందుకు కేరళం వెళ్లారు.
ప్రధాని మోడీ సంజు శాంసన్ ఆటతీరును ప్రశంసించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


