
📌 Key Points
- రోషన్ కనకాల నటనలో మెచ్యూరిటీ కనిపించింది, ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు.
- సినిమాలోని పాత్రలను రామాయణంతో పోల్చుతూ కథనం సాగింది, అది బాగా వర్కౌట్ అయింది.
- సాక్షి మడోల్కర్ చెవిటి, మూగ పాత్రలో మంచి మార్కులు కొట్టేసింది, పాత్రకు న్యాయం చేసింది.
- విజువల్స్ చాలా బాగున్నాయి, అడవిలోని లొకేషన్స్ ఆకట్టుకున్నాయి.
స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ సినిమా రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారా? రామాయణం, కర్మ సిద్ధాంతానికి ముడిపెడుతూ తెరకెక్కిన ఈ ఫారెస్ట్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? రోషన్ నటన, డైరెక్షన్, కథనంపై పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి.
‘మోగ్లీ’ కథనం, నటీనటుల ప్రదర్శన
స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ సినిమా మోగ్లీ. కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్‌గా బండి సరోజ్ కుమార్ యాక్ట్ చేశాడు. రామాయణానికి ముడిపెడుతూ తెరకెక్కిన మోగ్లీ ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మోగ్లీ రివ్యూలో చూద్దాం.
నటీనటులు: రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్, సాక్షి మడోల్కర్, హర్ష చెముడు, కృష్ణ భగవాన్, సుహాస్, రియా సుమన్ తదితరులు
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
రామాయణం, కర్మ సిద్ధాంతానికి లింక్
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేది: 13 డిసెంబర్ 2025
నందమూరి బాలకృష్ణ అఖండ 2 విడుదలతో ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా మోగ్లీ. స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సాక్షి మడోల్కర్ చేసింది. నిర్భంధం, మాంగళ్యం సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్, నటుడు బండి సరోజ్ కుమార్ విలన్‌గా చేశాడు.
ఆ సినిమా టీమ్‌లోని డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు కిట్టు. అయితే, జాస్మిన్ వినలేదు, మాట్లాడలేదు. అయినా ఇద్దరు ప్రేమలో పడతారు. మోగ్లీ రాముడు అయితే, జాస్మిన్ సీత అంటాడు కిట్టు. ఈ క్రమంలోనే సీతరాముల్లాంటి జోడీ మధ్యలోకి రావణుడిలా ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) ఎంట్రీ ఇస్తాడు.
సాంకేతిక వర్గం, ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది?
సినిమాలోని క్యారెక్టర్స్‌ను రామాయణం లోని పాత్రలకు ముడిపెడుతూ కథనం సాగించే ప్రయత్నం చేశారు. అది బాగానే వర్కౌట్ అయింది. తెలిసిన కథ అనిపించినా ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది. హీరో హీరయిన్ లవ్ ట్రాక్ బాగానే ఉంటుంది. అలాగే, క్రిస్టోఫర్ నోలన్ విలనిజం ఆకట్టుకుంటుంది. కానీ, ఒక దశ తర్వాత అతి వల్ల ఓవర్ ఫీలింగ్ కలుగుతుంది.
క్లైమాక్స్ డిఫరెంట్‌గా ట్రై చేసినట్లు అనిపించింది. అది అందరికి కనెక్ట్ కాకపోవచ్చు. ఇకపోతే సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. అడవిలోని లొకేషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే ఓకే. ఇక హీరోగా రోషన్ కనకాల నటనతో చాలా బాగా మెప్పించాడు.
ప్రధానంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన శైలితో రోషన్ ఆకట్టుకున్నాడు. గత సినిమాతో పోలిస్తే రోషన్ యాక్టింగ్‌లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా చాలా ఈజ్‌తో చేశాడు. చెవిటి, మూగగా సాక్షి మడోల్కర్ మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది.
మొత్తంగా, మోగ్లీ సినిమా రామాయణం స్ఫూర్తితో రూపొందిన ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. రోషన్ కనకాల మెరుగైన నటన, విజువల్స్ ఆకట్టుకున్నాయి. తెలిసిన కథ అయినా ఎమోషనల్ కనెక్టివిటీ బాగుంది. ఈ వారాంతంలో కొత్తదనం కోరుకునే వారికి ఇది ఒక ఆసక్తికరమైన ఎంపిక.


