|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవం: 50 ఏళ్ల ప్రయాణానికి ప్రతిష్టాత్మక పురస్కారం!

Published: 25-01-2026, 10:05 AM
మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవం: 50 ఏళ్ల ప్రయాణానికి ప్రతిష్టాత్మక పురస్కారం!
  • మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానం
  • 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు
  • 570 పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు
  • గతంలో పద్మశ్రీ పురస్కారం, ఎంజీఆర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న మోహన్ బాబు

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరుగాంచిన మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు లభించనుంది. ఆయన సినీ జీవితంలో ఇది ఒక గొప్ప మైలురాయి.

మోహన్ బాబు సినీ జీవితం – ఒక మైలురాయి

Mohan Babu: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)ఒకరు. విలన్ పాత్రలతో మొదలైన ఈయన ప్రస్థానం హీరోగా నిర్మాతగా మారి ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను అందించడమే కాకుండా ఎన్నో పురస్కారాలను గౌరవాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇటీవల 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో 50 సంవత్సరాల సినీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇలా మోహన్ బాబు 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో ఈయన మరో గౌరవాన్ని అందుకోబోతున్నారు.

2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పద్మ అవార్డులలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలో ఈ పురస్కారాన్ని సొంతం చేసుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు సైతం 2026 రిపబ్లిక్ డే పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోబోతున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసమానమైన కృషికి, 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాన్ని మోహన్ బాబుకు అందజేయబోతున్నారు. ఇలా మోహన్ బాబుకి ఈ విధమైనటువంటి అవార్డు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గణతంత్ర దినోత్సవం నాడు మోహన్ బాబుకు సత్కారం

మోహన్ బాబు ఇలాంటి అవార్డుకు ఎంపిక కావడంతో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు అభిమానులు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. మోహన్ బాబు తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో సుమారు 570 కు పైగా సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఐదు దశాబ్దల సినీ ప్రయాణంలో నిర్మాతగా మారి కలెక్షన్ కింగ్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇక ఈయన చిత్ర పరిశ్రమలో ఇప్పటికి ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

పద్మశ్రీ పురస్కారం అందుకున్న మోహన్ బాబు..

సినీ పరిశ్రమకు మోహన్ బాబు సేవలు

మోహన్ బాబుకు గతంలో ఎంజీఆర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు మోహన్ బాబు అందించిన సేవలకు గాను 2007వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి గౌరవ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, మోహన్ బాబు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే .ఈయన ఎంపీగా కూడా గతంలో బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న మోహన్ బాబు సినిమాలతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇక ఇటీవల కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మోహన్ బాబు గారికి ఈ పురస్కారం రావడం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.