|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోహన్ బాబు: ఆ విషయాలు తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

Published: 05-06-2025, 9:27 AM
మోహన్ బాబు: ఆ విషయాలు తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

ప్రముఖ నటుడు మోహన్ బాబు తాజాగా తన తల్లి గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘కన్నప్ప’ సినిమా నిర్మాత అయిన ఆయన, తన తల్లి జ్ఞాపకాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా జూన్ 27న విడుదలవుతోంది.

Key Points

1

మోహన్ బాబు తన తల్లి గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు.

2

‘కన్నప్ప’ సినిమా జూన్ 27న విడుదలవుతోంది.

4

మోహన్ బాబు తల్లి కష్టాలను గుర్తుచేసుకుని ఆయన బాధపడ్డారు.

మోహన్ బాబు ఎమోషనల్ వీడియో

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu Vishnu), ముఖేష్ కుమార్(Mukesh Kumar Singh) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్(Mohanlal), మోహన్ బాబు, అక్షయ్ కుమార్(Akshay Kumar), శరత్ కుమార్, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. షూటింగ్‌ కంప్లీట్ చేసుకున్న ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, మోహన్ బాబ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ‘‘నా దృష్టిలో మా అమ్మనాన్నలు కన్నప్పలు.

మా అమ్మకు రెండు చెవులు వినిపించేవి కాదు. అయితే ఈ దేవుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడు. టౌన్ నుంచి మా ఊరుకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఆ దారి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఒక కాలువ, నదిని దాటితే తప్ప మా ఊరుకు పోలేము. అయితే మా అమ్మ మా ఐదుగురిని మోసుకుంటూ ఆ దారిలోనే వెళ్లేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాలు తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు.. ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా అని బాధపడేవాడిని. నాకు నా కన్నతల్లి కన్నప్ప’’ అని చెప్పుకొచ్చారు.

‘కన్నప్ప’ సినిమా విడుదల

మోహన్ బాబు తల్లి జ్ఞాపకాలు

మోహన్ బాబు తన తల్లి గురించి పంచుకున్న ఎమోషనల్ కథ ప్రేక్షకులను కదిలించింది. ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.