|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండు.. డార్లింగ్‌కు వెరైటీ బర్త్‌డే విషెస్‌

Published: 23-10-2025, 5:20 AM
అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండు.. డార్లింగ్‌కు వెరైటీ బర్త్‌డే విషెస్‌

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోహన్‌బాబు ఇచ్చిన వెరైటీ బర్త్‌డే విషెస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకుని అరడజను మంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించారు. ఈ ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Key Points

1

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోహన్‌బాబు ప్రత్యేక శుభాకాంక్షలు.

2

త్వరలో పెళ్లి చేసుకుని ఆరుగురు పిల్లల్ని కనమని మోహన్‌బాబు ఆశీస్సులు.

4

"కన్నప్ప" సినిమాలో ప్రభాస్ నటించడానికి మోహన్‌బాబే ప్రధాన కారణం.

మోహన్‌బాబు వెరైటీ బర్త్‌డే విషెస్‌

కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ ( Prabhas ) నటించడానికి ప్రధాన కారణం మోహన్‌బాబు ( Mohan Babu ). ఆయన మీదున్న గౌరవంతోనే విష్ణు సినిమాలో నటించేందుకు ముందుకొచ్చాడు. తన లుక్‌తోనే సినిమాకు కావాల్సినంత హైప్‌ తీసుకొచ్చాడు. ప్రభాస్‌ను మోహన్‌బాబు ముద్దుగా బావ అని పిలుస్తుంటాడు. ఈ రోజు (అక్టోబర్‌ 23) డార్లింగ్‌ బర్త్‌డే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

బావకు బర్త్‌డే విషెస్‌ మై డియర్‌ డార్లింగ్‌ బావా ప్రభాస్‌.. దేశానికే నువ్వు గర్వకారణం. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతులేని సంతోషంతో ఆనందంగా గడపాలి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని, అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో, నిన్ను ఎప్పుడూ ప్రేమించే బావ అని ట్వీట్‌ చేశాడు.

ప్రభాస్‌కు మోహన్‌బాబు ఆశీస్సులు

భలే సరదా.. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రభాస్‌ను అలా ఊహించుకుంటే భలే సరదాగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఇంకా పెళ్లి ఊసే లేదంటే.. పిల్లల వరకు వెళ్లిపోయారా.. అని ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్‌, మోహన్‌బాబు.. బుజ్జిగాడు సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరిద్దరూ ఒకరినొకరు బావ అని పిల్చుకుంటారు.

అభిమానుల స్పందన

మొత్తానికి, మోహన్‌బాబు సరదా ట్వీట్ ప్రభాస్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచింది. ప్రభాస్ పెళ్లి, పిల్లల గురించి చర్చను రేపిన ఈ విషెస్ టాలీవుడ్‌లో కొత్త హాట్‌ టాపిక్‌గా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.