
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజా చిత్రం ‘తుడరుమ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కేరళలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయాన్ని మోహన్ లాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Key Points
మోహన్‌లాల్ ‘తుడరుమ్’ సినిమా కేరళ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసింది.
ఇది కేరళ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లు క్రాస్ చేసిన తొలి మలయాళ సినిమా.
మోహన్‌లాల్ ఈ మైలురాయిని చేరుకున్నట్లు ట్వీట్ చేశారు.
‘తుడరుమ్’ సినిమా తెలుగులోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
‘తుడరుమ్’ సినిమా విజయం
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇక ఇటీవల మోహన్‌లాల్ ‘ఎల్-2: ఎంపురాన్’(L-2: Empuran) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా మార్చి 27న థియేటర్స్‌లో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. అలాగే బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత మోహన్‌లాల్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ‘తుడరుమ్’ (Thudarum)చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. తరుణ్ మూర్తి(Tarun Murthy) దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో శోభన, ప్రకాష్ వర్మ, ఫర్హాన్ షాసిల్, మణియంపిల్ల రాజు వంటి వారు కీలక పాత్రలో కనిపించాడు.
అయితే ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు మేకర్స్. తమిళంలోనే కాకుండా ‘తుడరుమ్’ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా, ఈ సినిమా ఓ మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. కేవలం కేరళ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా ‘తుడరుమ్’ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. దీంతో మోహన్‌లాల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘‘మనమంతా కలిసి ఈ మైలురాయిని చేరుకున్నాం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రూ. 100 కోట్ల కలెక్షన్లు
మోహన్‌లాల్ ట్వీట్
మొత్తంమీద, ‘తుడరుమ్’ సినిమా మోహన్‌లాల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. కేరళ బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం అభినందనీయం.


