
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
- హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి.
- ప్రస్తుతం నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉంది.
- సరిపోదా శనివారం సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయతో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని టాక్.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడంతో, ఇప్పుడు నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేసే అవకాశం ఉంది.
మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తున్న వార్తలు
Mokshagna Teja : ఇండస్ట్రీ లోకి హీరోల వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎంతోమంది సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. మరి కొంతమంది మాత్రం హిట్ సినిమాలు లేక ఒక్క సినిమా అయినా హిట్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరు చూపు నందమూరి బాలయ్య వారసుడు పైనే ఉంది. ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈయన ఎంట్రీ ఆల్మోస్ట్ టైం అయిపోయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ హీరోని లాంచ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఇప్పుడు హీరో నాని డైరెక్టర్ మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నందమూరి నరసింహం బాలయ్య తన సూపర్ హిట్ చిత్రాలతో జనాలని బాగా ఎంటర్టైన్ చేశాడు. అయితే ఇప్పటివరకు బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఇంటర్వ్యూ పోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నాడు అని అందరూ అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ తేజ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయబోతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్.. ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరు అంటే నానితో ‘సరిపోదా శనివారం’ మూవీతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ తో సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడానికి కారణం?
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మోక్షజ్ఞ?
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. మా యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన బాలయ్య ఈమధ్య నటించిన సినిమాలు పెద్దగా అందుకోలేదు.. డాకు మహారాజు, ఈ ఏడాది వచ్చిన అఖండ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు కానీ ఈ సినిమా యావరేజ్ టాక్ ని అందుకోవడంతో నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా వస్తే చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


