
📌 Key Points
- చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనపై భర్త అనుమానాలు వ్యక్తం చేశారు.
- భార్య, పిల్లల ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని భర్త సురేందర్ రెడ్డి ఆరోపణ.
- ఆస్తుల కోసమే తన కుటుంబం హత్యకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- విజయారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ పిల్లలను ఎలా ఒప్పించిందనేది ప్రశ్నార్థకం.
చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు ఒక కొలిక్కి వచ్చేలా లేదు. భార్య, పిల్లల మరణం వెనుక కుట్ర ఉందని భర్త అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో మిస్టరీ వీడేనా?
హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద కొన్ని రోజుల క్రితం తల్లీబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. వీరి ఆత్మహత్యలపై ఎంతోమంది రకరకాలుగా విశ్లేషణ చేశారు. ఒంటరిగా ఉండటం వలన విజయారెడ్డి సూసైడ్ చేసుకునేవైపు ఆలోచనలు చేసిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పిల్లల జీవితాలను అన్యాయం చేశారని కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు.
ఇవన్నీ పక్కనపెడితే.. తాజాగా ఈ కేసు మరో మలుపు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ ముగ్గురి ఆత్మహత్య లకు గల కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకు చనిపోయారు? అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ కూడా విమర్శలు వచ్చాయి. రైల్వే పోలీసులను సైతం ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు చేశారు కొందరు. ఇలాంటి సమయంలో బాధితురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి నెలకొన్నది.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని హరితవనం కాలనీలో సురేందర్ రెడ్డి, విజయారెడ్డి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి కుమారుడు విశాల్ రెడ్డి, కుమార్తె్ చేతన ఉన్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్‌లో జాబ్ చేస్తూ.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండేవారు.
ఆస్తుల కోసమే హత్య జరిగిందా? భర్త ఆరోపణలు
జనవరి 30వ తేదీ రాత్రి విజయారెడ్డి, తన ఇద్దరు పిల్లలు చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, టీమ్ లీడర్‌గా పని చేస్తున్న విజయారెడ్డి, ఇంటర్ చదివే తన పిల్లను సూసైడ్ చేసుకునేందుకు ఎలా ఒప్పించింది? అని ఎవరికీ అర్థంకాలేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైనా వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారా? లేదంటే ఒంటరితనం తట్టుకోలేని విజయారెడ్డి పిల్లలను తీసుకుని వెళ్లి సూసైడ్ చేసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు అందరికి వచ్చాయి.
సూసైడ్ ఘటన తెలిసిన వెంటనే భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి వచ్చారు. ఈ విషయంతో తట్టుకోలేకపోయాడు. కానీ నెమ్మదిగా కోలుకుంటూ.. తన భార్య, పిల్లలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అని ప్రశ్నలు మెుదలుపెట్టాడు. తన భార్య, పిల్లల ఆత్మహత్యల వెనక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.
ఆస్తులను కొట్టేయడానికి భారీ కుట్ర జరిగిందని, ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాడు. అంతేకాదు వెళ్లి.. మేడిపల్లి పోలీసుల ను ఆశ్రయించాడు. తనకు ప్రాణ హాని ఉందని, తన భార్య, పిల్లలు మృతి వెనక కుట్ర ఉందని పేర్కొన్నాడు. తన భార్య విజయారెడ్డి సంపాదించిన రూ.కోట్ల ఆస్తులను దొంగిలించారంటూ.. పోలీసులకు చెప్పాడు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు.
పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయా?
అంతేకాదు ఆస్తి అంతా ఎవరికి వెళ్తుందని, వెంటనే సెటిల్ చేసుకోమని తనకు బెదిరింపులు వస్తున్నాయని సురేందర్ రెడ్డి చెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని కూడా మేడిపల్లి పోలీసులకు వివరించాడు. అవసరం అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. భర్త ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వస్తుందో లేదో వేచి చూడాలి.


