|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోటోరోలా రేజర్ ఫోల్డ్: ఇది కేవలం ఫోన్ కాదు, లగ్జరీ స్టేటస్! ధర వింటే షాక్ అవుతారు!

Published: 13-05-2026, 5:30 AM
మోటోరోలా రేజర్ ఫోల్డ్: ఇది కేవలం ఫోన్ కాదు, లగ్జరీ స్టేటస్! ధర వింటే షాక్ అవుతారు!
  • మోటోరోలా రేజర్ ఫోల్డ్ ధర రూ. 1,49,999 నుండి ప్రారంభం, 16GB/512GB మోడల్ రూ. 1,59,999.
  • 165Hz కవర్ డిస్‌ప్లే, 120Hz మెయిన్ 2K pOLED డిస్‌ప్లేతో అద్భుతమైన విజువల్స్.
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు.
  • ప్రారంభ ఆఫర్లలో రూ. 10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఏడాది పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్.

మోటోరోలా అభిమానుల కోసం సరికొత్త రేజర్ ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది కేవలం స్మార్ట్‌ఫోన్ కాదు, లగ్జరీ స్టేటస్ సింబల్. అద్భుతమైన ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ధరతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ధర, ప్రారంభ ఆఫర్లు

Motorola Razr Fold ( Image Credit : Gemini AI )

Motorola Razr Fold : మోటోరోలా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఫోన్ లాంచ్ అయింది. గత మార్చిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2026) జరిగిన ఈవెంట్లో కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లోపల స్క్రీన్ భారీగానూ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ప్రీమియం డిజైన్‌తో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

ధర, ప్రారంభ ఆఫర్లు : మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత (Motorola Razr Fold) మార్కెట్లో రూ. 149,999 నుంచి ప్రారంభమవుతుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 159,999గా ఉంది.

ఈ కంపెనీ రూ. 169,999 ధరతో ఫీఫా వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ బ్లాకెన్డ్ బ్లూ, పాంటోన్ లిల్లీ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ. 10వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకులతో 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జూన్ 20వ తేదీలోపు ఫోన్‌ కొనుగోలు చేసే యూజర్లు ఏడాది పాటు ఫ్రీగా ఒకసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని పొందవచ్చు.

Read Also : Honda NX500 : కొత్త హోండా ఇ-క్లచ్ బైక్ వచ్చేసింది.. ఇకపై క్లచ్ లేకుండానే గేర్లు మార్చొచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?

జియో యూజర్లకు స్పెషల్ బెనిఫిట్స్ : జియో యూజర్లు రూ. 449 ప్లాన్‌పై 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, జెమిని ప్రో ప్లాన్‌తో 5000GB స్టోరేజ్, అజియో, ఈజ్‌మైట్రిప్ టిరా వంటి ఆఫర్లతో సహా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్ : మోటోరోలా రేజర్ ఫోల్డ్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ 6000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.6-అంగుళాల ఎల్టీపీఓ pOLED కవర్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందించే 8.1-అంగుళాల 2K ఎల్టీపీఓ pOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే అల్ట్రా థిన్ గ్లాస్ (UTG) ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ : ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అడ్రెనో A829 జీపీయూ, 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మై యూఎక్స్ (My UX)పై రన్ అవుతుంది. 7 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది.

50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8K వీడియో రికార్డింగ్ : ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ లైటియా ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP కవర్ స్క్రీన్ 20MP ఇన్నర్ డిస్‌ప్లే కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ : మోటోరోలా రేజర్ ఫోల్డ్‌లో 6000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ అందిస్తుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 5G, Wi-Fi 7, NFC, GPS, NavIC, USB టైప్-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ IP49 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.

మోటోరోలా రేజర్ ఫోల్డ్ తన ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిస్‌ప్లేలతో మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. అధిక ధర ఉన్నప్పటికీ, లగ్జరీ అనుభూతిని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.