
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి స్టార్‌గా ఎదిగిన నానికి మౌళి తనుజ్ పెద్ద ఫ్యాన్. తన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా హిట్ అవ్వడంతో నాని అభినందనలు తెలిపాడు. నానిని కలవడానికి అవకాశం వచ్చినా, తన పని తర్వాత అని కలవలేదు అని మౌళి తెలిపాడు.
Key Points
మౌళి తన 'లిటిల్ హార్ట్స్' సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు.
నాని ఈ సినిమాను చూసి అభినందించాడు.
మౌళి నాని డై హార్డ్ ఫ్యాన్ అని తెలిపాడు, గతంలో కలవడానికి అవకాశం వచ్చినా కలవలేదని చెప్పాడు.
మౌళి భవిష్యత్తులో నానితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాడు.
లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్
Mouli Tanuj : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి స్టార్ గా ఎదిగిన హీరోల్లో నాని ఒకరు. నాని కూడా తన నటన, సింప్లిసిటీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల వరుసగా సినిమాలు హిట్ కొడుతుండటంతో నానికి కూడా ఫ్యాన్స్ బాగానే పెరిగారు. తాజాగా నాని డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఓ నటుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.(Mouli Tanuj)
సోషల్ మీడియా రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న మౌళి తర్వాత నటుడిగా మారాడు. ఇప్పుడు హీరోగా లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా కేవలం 2 కోట్లతో తీస్తే ఏకంగా 15 కోట్లు వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాని ప్రేక్షకులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో నాని లిటిల్ హార్ట్స్ సినిమా చూసి ట్వీట్ చేసారు.
నాని అభినందనలు
నాని తన ట్వీట్ లో.. లిటిల్ హార్ట్స్ అదిరిపోయే కామెడీ సినిమా. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. అఖిల్, మధు, కాత్యాయని మీరంతా నా రోజుని స్పెషల్ చేశారు. నేను ఐ లవ్ యు చెప్పను కానీ థ్యాంక్యూ చెప్తాను అని రాసి మూవీ యూనిట్ ని అభినందించాడు. దీంతో ఈ ట్వీట్ కి మౌళి రిప్లై ఇచ్చాడు.
మౌళి నాని ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ సో మచ్ నాని అన్న. నీకు తెలియకపోవచ్చు కానీ నేను నీకు పెద్ద ఫ్యాన్ ని నీ పిల్ల జమిందార్ సినిమా నుంచి. గతంలో నిన్ను ఒకసారి కలిసే ఛాన్స్ వచ్చింది కానీ నేను కలవలేదు. ఒక మాములు ఫ్యాన్ లాగా కాకుండా నా వర్క్ తెలిసాకే కలుద్దాం అని ఫిక్స్ అయ్యాను. దాని కోసం నేను పనిచేసాను ఇవాళ సాధించాను. మౌళి నానికి డై హార్డ్ ఫ్యాన్ ఎప్పటికి. ఈ రోజు కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నా ఏదో ఒక రోజు నీ గోడలో ఇటుక అవుతా పక్కా అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
మౌళి-నాని మధ్య సంబంధం
నాని గతంలో తను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్న కొత్త నటీనటులను, దర్శకులను ఉద్దేశించి నేను బలంగా ఒక గోడ తయారు చేస్తున్నాను అందుకు ఒక్కో ఇటుక పేరుస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు మౌళి నాని కట్టే గోడలో ఇటుక అవుతాను అనడంతో భవిష్యత్తులో మౌళి నానితో కానీ, నాని నిర్మాణ సంస్థలో కానీ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక నాని ఫ్యాన్స్ మౌళి ని ఆకాశానికెత్తేస్తున్నారు.
మౌళి తన కృషి ఫలితంగా నాని అభినందనలు పొందాడు. భవిష్యత్తులో వీరిద్దరి సహకారం చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మౌళి లాంటి యువ నటులకు ఇది ఒక ప్రోత్సాహం.


