|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మౌనీ రాయ్‌కు వేధింపులు: బాలీవుడ్ హీరోయిన్ల మద్దతు! దిగ్భ్రాంతిలో నటి!!

Published: 25-01-2026, 9:05 PM
మౌనీ రాయ్‌కు వేధింపులు: బాలీవుడ్ హీరోయిన్ల మద్దతు! దిగ్భ్రాంతిలో నటి!!
  • హరియాణాలో మౌనీ రాయ్‌కు వేధింపులు ఎదురయ్యాయి.
  • బాలీవుడ్ నటీమణులు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపారు.
  • భూమి పెడ్నేకర్, తాహిరా కశ్యప్ మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.
  • ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మౌనీ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరియాణాలోని ఒక కార్యక్రమంలో నటి మౌనీ రాయ్ వేధింపులకు గురయ్యారు. దీనిపై బాలీవుడ్ నటీమణులు ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

మౌనీ రాయ్‌కు మద్దతుగా బాలీవుడ్

Mouni Roy : ఈ మధ్య హీరోయిన్లు జనాల్లోకి వెళ్ళినపుడు జనాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని తాకడానికి లేదా ఫొటోల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడానికి కొందరు అకతాయిలు ప్రయత్నిస్తుంటారు.. ఇటీవల తెలుగు హీరోయిన్లకు కూడా ఆ చేదు అనుభవం ఎదురైంది. ఇది మరువకముందే బాలీవుడ్ లో ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలాంటి ఘోర అవమానమే ఎదురైంది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా మౌనీ రాయ్ కు బాలీవుడ్ హీరోయిన్లు సపోర్ట్ చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఈవెంట్ లో మౌనీ రాయ్ కు ఎదురైన చేదు అనుభవం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆమెకు మద్దతుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ సోషల్ మీడియా వేధికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీభూమి పెడ్నేకర్ బాలీవుడ్ బబుల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, వేధింపులకు మౌని ప్రతిస్పందనకు మద్దతుగా, చప్పట్లు కొట్టే ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అలాగే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా తన మద్దతును తెలియజేసి, చప్పట్లు కొట్టే ఎమోజీతో పోస్ట్ పెట్టింది. ఇలా ఒక్కొక్కరు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సపోర్ట్ చేస్తున్నారు..

కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మౌనీ రాయ్ స్టేజ్ మీదకు వెళ్తుండగా తాత వయస్సున్న ఇద్దరు వ్యక్తులు, తమ కుటుంబ సభ్యులు ఫోటోల పేరుతో తన నడుముపై చేతులు వేసి ఇబ్బంది పెట్టారని మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసింది. ఆరోజు భయానక పరిస్థితులను ఎదుర్కొన్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు తనకు ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్తున్నా సరే.. వాళ్లు వినకపోగా, స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంలో కూడా అసభ్యకరమైన సైగలు చేస్తూ, వీడియోలు తీస్తూ వేధించినట్లు ఆమె వెల్లడించారు. అభ్యంతరకరమైన పదజాలంతో వేధించడం తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని చెప్పారు.. అంత జరుగుతున్నా సరే ఈవెంట్ ఆర్గనైజర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మౌనీ రాయ్ మండిపడ్డారు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించినప్పటికీ, నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు.

సోషల్ మీడియాలో మద్దతు పోస్టులు

ఈ ఘటన వెలుగు చూడటంతో ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అభిమానులు, నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, మహిళల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఇలాంటివి జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటివి పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు..

వేధింపులపై మౌనీ రాయ్ ఆవేదన

#MouniRoy walks out mid performance, showing mid finger after harrassment by 2 uncles pic.twitter.com/Yk6piuJ2Xc

— $@M (@SAMTHEBESTEST_) January 25, 2026

మౌనీ రాయ్ ఎదుర్కొన్న వేధింపుల ఘటన బాధాకరమైనది. ఆమెకు బాలీవుడ్ నుండి మద్దతు లభించడం కొంత ఊరటనిచ్చే విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.