
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా దర్శకుడు అభిషన్ జివింత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిసిన తర్వాత ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆయన రజినీకాంత్ గురించి ఎమోషనల్‌గా రాస్తూ, ఆయనతో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.
Key Points
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా ఘన విజయం సాధించింది.
దర్శకుడు అభిషన్ జివింత్ రజినీకాంత్‌ను కలిశాడు.
రజినీకాంత్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
రజినీకాంత్ నిరాడంబరతను అభిషన్ ప్రశంసించాడు.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా విజయం
ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్(Simran), శశి కుమార్, మిథున్‌జై శంకర్, యోగిబాబు, కమలేష్ జగన్(Kamalesh Jagan) కీలక పాత్రలో నటించిన మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist family). అయితే ఈ సినిమా అభిషన్ జివింత్ దర్శకత్వంలో తెరకెక్కించగా..యువరాజ్ గణేశన్, నజేరధ్ పసిలియన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లో విడుదలై ఊహించని విధంగా హిట్ సాధించింది. అంతేకాకుండా ఎంతోమంది తమిళ, తెలుగు సినీ ప్రముఖు ప్రశంసలు అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, అభిషన్ జివింత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలుసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నేను సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో నాకు ఈ రోజే అర్థమైంది. రజినీకాంత్ నా పేరు పిలిచి నన్ను గట్టిగా హత్తుకోగానే ఒళ్లంతా పులకరించిపోయింది. ఆయన నవ్వు చూస్తే చిన్నప్పుడు నేను చేసిప ప్రార్థనలన్నీ ఆలస్యంగా నా దగ్గరికి వచ్చినా, సరిగ్గా నాకు కావాల్సినప్పుడే వచ్చాయనిపించింది. ఆయన ఎంత మంది మనిషి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాను. రజినీకాంత్ ఎంత నిరాడంబరంగా ఉంటారు’’ అని రాసుకొచ్చాడు. అలాగే ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు.
అభిషన్ జివింత్ ట్వీట్
రజినీకాంత్‌తో అనుభవం
అభిషన్ జివింత్ తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా రజినీకాంత్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ, సినీ ప్రపంచంలో ఆయన ప్రభావాన్ని చాటి చెప్పాడు. ఈ ఘటన సినీ ప్రేమికులను ఆకట్టుకుంది.


