|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజినీకాంత్, కమల్ హాసన్ వదులుకున్న భారీ ప్రాజెక్ట్.. లోకేష్ కనకరాజ్ తెలుగు హీరోలతో చేయబోతున్నాడా?

Published: 16-12-2025, 12:24 PM
రజినీకాంత్, కమల్ హాసన్ వదులుకున్న భారీ ప్రాజెక్ట్.. లోకేష్ కనకరాజ్ తెలుగు హీరోలతో చేయబోతున్నాడా?
  • లోకేష్ కనకరాజ్ ‘మా నగరం’, ‘ఖైదీ’ వంటి విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు.
  • ‘కూలి’ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో కోలీవుడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది.
  • తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో లోకేష్ మల్టీస్టారర్ చేయనున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.
  • రజినీకాంత్, కమల్ హాసన్ తిరస్కరించిన ప్రాజెక్టులనే లోకేష్ తెలుగు హీరోలతో చేస్తున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

లోకేష్ కనకరాజ్ ‘కూలి’ సినిమా నిరాశపరిచినా, అతని తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో మల్టీస్టారర్ చేయనున్నాడనే వార్తలు సినీ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. అయితే ఇది రజినీకాంత్, కమల్ హాసన్ వదులుకున్న ప్రాజెక్టేనా అన్న చర్చ మొదలైంది.

లోకేష్ కెరీర్‌లో ‘కూలి’ ప్రభావం

Lokesh Kanagaraj : సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ సక్సెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సక్సెస్ పెడితే వరుస అవకాశాలు రావడం అనేది సహజంగానే జరుగుతుంది అలానే ఒక ఫెయిల్యూర్ పెడితే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ కనకరాజ్ అంటే ఒక బ్రాండ్.

మా నగరం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. రెజీనా కసాండ్రా సందీప్ కిషన్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కార్తీ నటించిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ లెవెల్ నెక్స్ట్ రేంజ్ కు వెళ్ళిపోయింది కంప్లీట్ స్టార్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నాడు.

కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా లోకేష్ కనగరాజ్ సినిమాలకు బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టారు. కానీ కూలి సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందించకపోవడంతో లెక్కలన్నీ కూడా తారుమారు అయిపోయాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మల్టీ స్టారర్ సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది.

తెలుగులో భారీ మల్టీస్టారర్ ప్రణాళిక

లోకేష్ కనగరాజ్ గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని గురించి అధికారకు ప్రకటన రాలేదు. ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మల్టీ స్టారర్ సినిమాను చేయనున్నాడట లోకేష్.

ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ హీరోలుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ ఇద్దరు కూడా స్క్రిప్ట్ విని బాగా ఇంప్రెస్ అయిపోయారు అని కూడా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు వస్తున్న సందేహం ఏంటంటే తమిళ్లో రజనీకాంత్ మరియు కమలహాసన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులనే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ చేస్తున్నాడా అనేది చాలామందికి వస్తున్న సందేహం. అయితే దీని గురించి లోకేష్ మాట్లాడితే తప్ప ఎవరికీ క్లారిటీ రాదు.

రజినీ-కమల్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్టేనా?

మరోవైపు కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమాను లోకేష్ కనగరాజ్ చేయాల్సి ఉంది. కూలి సినిమా తర్వాత అదే ప్రాజెక్ట్ మొదలవుద్ది అని అందరూ ఊహించారు లోకేష్ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించి సరైన క్లారిటీ లేదు. ఇదే విషయాన్ని కార్తి మాట్లాడుతూ కూడా ఖైదీ 2 సినిమా విషయం పైన నాకు కూడా క్లారిటీ లేదు అంటూ తేల్చి చెప్పేసాడు. వీటన్నిటికీ లోకేష్ మాత్రమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి.

లోకేష్ కనకరాజ్ తెలుగులో భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నాడనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. రజినీకాంత్, కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితే, అది లోకేష్ కు సవాలే అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.