|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ ఛాన్స్! ఆ ఒక్క పాత్రతో స్టార్ అయ్యే అవకాశం చేజారిందా?

Published: 19-01-2026, 12:30 AM
నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ ఛాన్స్! ఆ ఒక్క పాత్రతో స్టార్ అయ్యే అవకాశం చేజారిందా?
  • దురంధర్ సినిమాలో విలన్ పాత్రకు మొదట నాగార్జునను సంప్రదించారు.
  • డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రను అక్షయ్ ఖన్నా చేశారు.
  • ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • రణవీర్ కంటే అక్షయ్ ఖన్నా నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి.

బాలీవుడ్ హిట్ చిత్రం ‘దురంధర్’ లోని విలన్ పాత్రలో నటించే అవకాశం నాగార్జునకు వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పాత్ర అక్షయ్ ఖన్నాకు దక్కింది.

నాగార్జున వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ

Dhurandhar:సాధారణంగా కొన్ని కథలను దర్శకులు తయారు చేసుకునేటప్పుడు ఆయా పాత్రలలో ఫలానా హీరో హీరోయిన్ అనుకొని మరీ పాత్రలు రాసుకుంటారు. అయితే ఆ కథలను వారి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు అనుకోకుండా వారు రిజెక్ట్ చేస్తే.. ఆ పాత్రలలో వేరే సెలబ్రిటీలు వచ్చి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటే.. అయ్యో ఈ పాత్ర మనం మిస్ చేసుకున్నామే అని బాధపడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇకపోతే తాజాగా సూపర్ హిట్ మూవీలో నాగార్జున (Nagarjuna) నటించాల్సి ఉండగా.. ఆ పాత్రను ఆయన మిస్ చేసుకోవడంతో అభిమానులు ఈ విషయం తెలిసి తెగ బాధ పడిపోతున్నారు.

ఆ చిత్రం ఏదో కాదు..గత ఏడాది ఆఖరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం వరుస కలెక్షన్లు అందుకుంటూ సూపర్ హిట్ గా నిలిచి బాలీవుడ్ రికార్డులను తిరగరాసి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ధురంధర్. అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా సినిమా వచ్చి నెల పైగానే అవుతున్నా.. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది.ఇందులో రణ్ వీర్ తో పాటు విలన్ రోల్ చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నాకు మంచి పేరు వచ్చిన మాట వాస్తవమే.

అక్షయ్ ఖన్నాకు కలిసొచ్చిన అవకాశం

ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో రణవీర్ కంటే అక్షయ్ ఖన్నానే బాగా నటించాడనే కామెంట్లు కూడా వచ్చాయి. ఇలాంటి సంచలనాలు నమోదు చేసిన ఈ సినిమాలో గొప్ప ఛాన్స్ ను వదులుకున్నారు అక్కినేని నాగార్జున. విషయంలోకి వెళ్తే.. ఈ పాత్రకు అక్షయ్ కన్నా కంటే ముందుగా నాగార్జునను ఆదిత్యధర్ సంప్రదించారట. విలన్ క్యారెక్టర్ కోసం నాగార్జునకు కథ కూడా చెప్పారట. ఆ కథ కూడా నాగార్జునకు చాలా బాగా నచ్చింది. అయితే అదే సమయంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ, ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర వంటి సినిమాలలో నెగిటివ్ ఉన్న పాత్ర చేస్తున్నారు. పైగా ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తుండడంతో..ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమాని ఒప్పుకోలేకపోయారు నాగార్జున.. దాంతో అక్షయ్ కన్నా ఆ పాత్రను చేసి ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ఎందుకీ సినిమాను వదులుకున్నారు?

ఇకపోతే ఈ విలన్ పాత్రలో అక్షయ్ కన్నా నూటికి శాతం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఒకవేళ నాగార్జున ఈ సినిమాలో నటించి ఉంటే మరింత ప్రత్యేకంగా ఉండేదని ఆయన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే నాగార్జున ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను మిస్ చేసుకున్నారు. ఒకవేళ ఇందులో కనుక ఆయన నటించి ఉంటే బాలీవుడ్లో నాగార్జున క్రేజ్ మరింత పెరిగేదని.. ఆయన 100 కోట్ల షేర్ మార్క్ కి మార్గం సుగమం అయ్యేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి నాగార్జున డేట్స్ సమస్యల కారణంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారు. అక్షయ్ ఖన్నాకు మాత్రం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది నాగార్జున అభిమానులను నిరాశపరిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.