|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Movie Stars : అన్ని పరిశ్రమల స్టార్స్ ఒకే ఫొటోలో.. చిరు, రజినీకాంత్ తో సహా.. ముంబై ఈవెంట్లో.. ఫోటో వైరల్..

Published: 01-05-2025, 8:49 AM
Movie Stars : అన్ని పరిశ్రమల స్టార్స్ ఒకే ఫొటోలో.. చిరు, రజినీకాంత్ తో సహా.. ముంబై ఈవెంట్లో.. ఫోటో వైరల్..

ముంబైలో జరిగిన ‘వేవ్స్’ సమ్మిట్‌లో దక్షిణాది మరియు బాలీవుడ్ స్టార్లు ఒకే వేదికపై కనిపించారు. చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్ లాంటి స్టార్ల సమక్షంలో ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

Key Points

1

ముంబైలో జరిగిన 'వేవ్స్' సమ్మిట్‌లో పలువురు దక్షిణాది, బాలీవుడ్ స్టార్స్ ఒకే వేదికపై కనిపించారు.

2

చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్స్ ఒకే ఫోటోలో కనిపించడంతో అభిమానులు ఫోటోను వైరల్ చేస్తున్నారు.

4

90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేవ్స్ సమ్మిట్‌లో స్టార్ల సమావేశం

Movie Stars : ఒకరిద్దరు హీరోలు, స్టార్స్ కనిపిస్తేనే ఆ ఫోటో వైరల్ గా మారి ఫ్యాన్స్ సంతోషిస్తారు. అలాంటిది ఇండియా వైడ్ పలువురు స్టార్స్ ఒకే ఫొటోలో కనిపిస్తుంటే ఆ ఫోటో మరింత వైరల్ అవ్వాల్సిందే. ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌) – 2025 కార్యక్రమం నేడు ముంబైలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.

చిరు, రజినీకాంత్ కలిసి ఒకే ఫోటోలో

కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నారు. అయితే ఇండియన్ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది స్టార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మన టాలీవుడ్ నుంచి నేడు మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగార్జున, రాజమౌళి.. మరికొంతమంది స్టార్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

వైరల్ అవుతున్న ఫోటో

తాజాగా ఈ వేవ్స్ సమ్మిట్ నుంచి అన్ని పరిశ్రమల నుంచి స్టార్స్ ఉన్న ఓ ఫోటో వైరల్ గా మారింది. బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తి, హేమమాలిని, అక్షయ్ కుమార్ తమిళ్ నుంచి రజినీకాంత్, తెలుగు నుంచి చిరంజీవి, మలయాళం నుంచి మోహన్ లాల్.. ఇలా స్టార్స్ అంతా ఒకే చోట కలిసి కనపడటంతో ఫ్యాన్స్, సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి, రజినీకాంత్ లాంటి స్టార్ల సమావేశం సినీ ప్రేమికులను ఆనందంలో ముంచెత్తింది. ఈ వైరల్ ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.