
కోలీవుడ్ స్టార్ విక్రమ్‌తో సినిమా చేయాలని దర్శకుడు ప్రేమ్‌కుమార్ చేసిన ప్రయత్నం విఫలమైంది. కథ నచ్చకపోవడంతో విక్రమ్ ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం ప్రేమ్‌కుమార్ మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్‌తో తన తదుపరి చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Key Points
ప్రేమ్‌కుమార్ విక్రమ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేశారు.
విక్రమ్‌కు సింగిల్ లైన్ నచ్చినా, పూర్తి స్క్రిప్ట్ రిజెక్ట్ చేశారు.
కథ నచ్చకపోవడంతో విక్రమ్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.
ప్రేమ్‌కుమార్ ఇప్పుడు ఫహద్ ఫాసిల్‌తో సినిమా చేస్తున్నారు.
విక్రమ్ రిజెక్ట్ చేసిన ప్రేమకథా చిత్రం
కోలీవుడ్ నటుడు విక్రమ్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఉన్నారు. ఆయనకు కథ నచ్చిందంటే అందులో నటించడానికి ఎంతవరకైనా వెళతారు. అయితే కథ ఆయనకు నచ్చాలి అంతే. వీరదీరసూరన్ చిత్రం తర్వాత విక్రమ్ ఇప్పటివరకు మరో చిత్రంలో నటించలేదు. అయితే పలు కథలు వింటున్నారు. అలా 96, సత్యం సుందరం చిత్రాల దర్శకుడు ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అది కూడా సెట్ పైకి వెళ్లలేదు. అందుకు కారణాలను దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెలుపుతూ.. తాను విక్రమ్ హీరోగా చిత్రం చేయాలని భావించినప్పుడు కథ రెడీ కాలేదని తెలిపారు. అయితే తన వద్ద ఉన్న రెండు కథలు సింగిల్ లైన్‌లను ఆయనకు వినిపించానని చెప్పుకొచ్చారు.
సినిమా నిలిచిపోవడానికి కారణాలు
అందులో విక్రమ్‌కు ఒక కథ నచ్చడంతో చేద్దామని కూడా చెప్పారు. దీంతో తాను పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి విక్రమ్ కు చెప్పగా ఆయన ఈ స్క్రిప్టు కాదు మీరు చెప్పిన ప్రేమకథా చిత్రం చేద్దామని మరోసారి చెప్పారు. అయితే ఓ చిత్రానికి కథను సిద్ధం చేసిన తర్వాత మరో కథను రెడీ చేయడానికి చాలా సమయం పడుతుందని విక్రమ్‌తో తాను చెప్పానన్నారు. దీంతో విక్రం హీరోగా చేయాల్సిన కథ అలా నిలిచిపోయిందని దర్శకుడు ప్రేమ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.
ఫహద్ ఫాసిల్‌తో ప్రేమ్‌కుమార్ కొత్త ప్రాజెక్ట్
ఫహాద్ ఫాజిల్‌కు మలయాళంతో పాటు తెలుగు, తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఈయన ఇటీవల వడివేలుతో కలిసి నటించిన మారిశన్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో ఫాహత్ ఫాజిల్ నటించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
విక్రమ్‌తో సినిమా నిలిచిపోయినా, ప్రేమ్‌కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఫహద్ ఫాసిల్‌తో చేస్తున్నారు. ఈ కొత్త కాంబినేషన్ నుండి వచ్చే చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


