
📌 Key Points
- రోషన్ కనకాల హీరోగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘మోగ్లీ’ సినిమా రూపొందింది.
- ‘అఖండ-2’ కారణంగా వాయిదా పడిన ‘మోగ్లీ’ కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 13.
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది.
- సినిమా ప్రీమియర్లు డిసెంబర్ 12 రాత్రి, ప్రపంచవ్యాప్త విడుదల 13న.
సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన ‘మోగ్లీ’ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ ప్రకటించింది. ‘అఖండ-2’ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం, డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘సింహం గర్జిస్తుంది’ అంటూ విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది.
‘మోగ్లీ’ చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న సినిమా ‘మోగ్లీ'(Mowgli). కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ సాక్షి(Sakshi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasd), కృతి ప్రసాద్(Kruthi Prasad) ఈ సినిమాను నిర్మించారు.
‘అఖండ-2’ కారణంగా వాయిదా పడిన మోగ్లీ
అయితే… డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ‘అఖండ 2′(Akhanda-2) కారణంగా వాయిదా పడింది. దీంతో న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఆడియన్స్‌తో పాటు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో తాజాగా చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
మోగ్లీ మూవీలో కీలక పాత్రలు, దర్శకుడు
ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘”సింహం” గర్జిస్తుంది, మరియు మోగ్లీ అడవి రాజును స్వాగతించడానికి వెనక్కి వస్తాడు.. ఈ సినిమా ప్రీమియర్స్ ను 12వ తేదీ రాత్రి వేసి, మూవీని 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో రోషన్ కనకాల నవ్వుతుండగా, సాక్షి క్యూట్‌గా చూస్తుండగా, సరోజ్ కుమార్ మాత్రం ఫేస్ మీద గాయాలతో సీరియస్‌గా చూస్తున్నాడు. కాగా 2.40 నిమిషాలు గల ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది.
‘సింహం గర్జిస్తుంది’ అంటూ ప్రకటించిన ‘మోగ్లీ’ కొత్త రిలీజ్ డేట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రోషన్ కనకాల ఈ చిత్రం ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. డిసెంబర్ 13న ‘మోగ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


