
📌 Key Points
- మృణాల్, సిద్ధాంత్ జంటగా ‘దో దీవానే షెహర్ మే’ మూవీ టీజర్ విడుదల! ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.
- ‘సీతా రామం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్.. ఇప్పుడు బాలీవుడ్‌లో రొమాంటిక్ డ్రామాతో మెస్మరైజ్ చేయడానికి రెడీ!
- సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో.. 1977 నాటి క్లాసిక్ సాంగ్ రీమేక్ వెర్షన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
- ఫిబ్రవరి 14న మృణాల్ నుండి ఊహించని సర్ ప్రైజ్! త్వరలో పెళ్లి వార్త ప్రకటన ఉంటుందా?
టాలీవుడ్ ప్రేక్షకులకు సీతారామంతో ఎంతగానో దగ్గరైన మృణాల్ ఠాకూర్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఆమె ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం!
ప్రేమలో మృణాల్.. వైరల్ అవుతున్న పోస్ట్!
గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)పేరు మార్మోగిపోతుంది. ఆమె కోలీవుడ్ స్టార్ హీరోలో ప్రేమలో పడినట్లు.. ఫిబ్రవరి 14న పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరు పలు చోట్ల కలుసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈనేపథ్యంలో.. మృణాల్ ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, మృణాల్ ప్రేమలో పడింది. ఓ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ.. టీజర్‌ను కూడా షేర్ చేసింది. టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్, యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi) మాయ చేసేందుకు సిద్ధమయ్యారు.
సిద్ధాంత్ చతుర్వేదితో రొమాంటిక్ డ్రామా!
వీరిద్దరు జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘దో దీవానే షెహర్ మే’(Do Deewane Seher Mein). విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘‘ఇద్దరు అసంపూర్ణ వ్యక్తుల మధ్య సాగే పరిపూర్ణ ప్రేమకథ’’ అని మేకర్స్ తెలిపారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ మోడ్రన్ రొమాన్స్ ఒక అందమైన జ్ఞాపకంలా ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. రవి ఉద్యావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీజర్ లో 1977 నాటి క్లాసిక్ సాంగ్ ‘దో దీవానే షెహర్ మే’ రీమేక్ వెర్షన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మృణాల్ ఠాకూర్ ఇప్పటికే ‘సీతా రామం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక ‘గల్లీ బాయ్’ సినిమాతో గుర్తింపు పొందిన సిద్ధాంత్ చతుర్వేది కూడా ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.
ఫిబ్రవరి 14న మృణాల్ నుండి సర్ ప్రైజ్!
సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ వాలెంటైన్స్ డే కు మృణాల్ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్.. కౌంట్‌డౌన్ చూసి ఇంకేదో అనుకున్నా? అని కామెంట్ పెట్టగా.. దానికి మృణాల్ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ‘‘ఏదైనా ముఖ్యమైన వార్త ఉంటే నేను ప్రకటిస్తాను’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ రిప్లై పెళ్లి గురించే ఇచ్చిందని అంతా అభిప్రాయపడుతున్నారు. కొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మృణాల్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. అప్పటివరకు మా పేజీని ఫాలో అవుతూ ఉండండి.


