
హిందీ, తెలుగు చిత్రాలలో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్, తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనేది తన చిన్ననాటి కల అని ఆమె వెల్లడించింది.
Key Points
మృణాల్ ఠాకూర్ తన పెళ్లి, పిల్లల కల గురించి మాట్లాడింది.
ప్రస్తుతం ఆమె సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది.
సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వచ్చే అవకాశం ఉంది.
మృణాల్ ఠాకూర్ కెరీర్ అప్‌డేట్స్
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ). 32 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ సీతారామం చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఠాగూర్‌కు అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా సీతారామం చిత్రం తమిళంలోనూ అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. దీంతో కోలీవుడ్‌లోనూ అవకాశాలు తలుపుతట్టాయి.
అలా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఏమైందో ఏమోకానీ, ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ చేజార్చుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమ ఆమె వైపు చూడడం లేదు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులోను డెలాయిట్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది.
పెళ్లి, పిల్లల కల గురించి మృణాల్ వెల్లడి
అదేవిధంగా అల్లు అర్జున్ సరసన నటించే మరో లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్నది తన చిన్న వయసు నుంచే కల అని పేర్కొంది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా చిత్ర పరిశ్రమపైనే ఉందని, సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వాలని తెలిపింది.
తెలుగు, హిందీ సినిమాల్లో మృణాల్ భవిష్యత్తు
ప్రస్తుతం సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టిన మృణాల్, భవిష్యత్తులో పెళ్లి, పిల్లలతో కుటుంబం కావాలని కోరుకుంటోంది. ఆమె తెలుగు, హిందీ చిత్రాలలో మరింత విజయం సాధించాలని కోరుకుందాం.


