|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మృణాల్ ఠాకూర్ పెళ్లి ప్రకటనతో టాలీవుడ్‌లో సంచలనం! ఎప్పుడు, ఎక్కడో చెప్పేసిందిగా!!

Published: 14-02-2026, 6:35 AM
మృణాల్ ఠాకూర్ పెళ్లి ప్రకటనతో టాలీవుడ్‌లో సంచలనం! ఎప్పుడు, ఎక్కడో చెప్పేసిందిగా!!
  • మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటన!
  • సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని తెలిపిన మృణాల్.
  • ‘దో దినావే సెహర్ మే’ చిత్రంతో అలరించనున్న మృణాల్ ఠాకూర్.
  • మార్చి 19న ఉగాది కానుకగా ‘డెకాయిట్’ విడుదల!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సంచలన వార్త! అందాల తార మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

మృణాల్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సెన్సేషన్, అందాల మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ, మృణాల్ తన వివాహం, జీవిత భాగస్వామి గురించి చాలా క్లారిటీగా స్పందించినప్పటికీ వార్తలకు చెక్ పడటం లేదు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు మృణాల్ సమాధానమిస్తూ.. ‘‘పెళ్లి అనేది నా జీవితంలో ఒక అందమైన మలుపు. దాన్ని నేను ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ, దానికి రెండు ప్రధానమైన కండిషన్స్ ఉన్నాయి. ఒకటి సరైన సమయం, రెండు సరైన వ్యక్తి. కేవలం వయసు పెరిగిపోతుందనో లేదా ఎవరో అడుగుతున్నారనో నేను తొందరపడి నిర్ణయం తీసుకోను. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికిన క్షణమే ఆ విషయాన్ని ప్రపంచానికి నేనే స్వయంగా ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ తరం వివాహ బంధాల గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

‘‘పాత రోజుల్లో పెళ్లి అంటే కుటుంబాల ఒత్తిడి, సామాజిక బాధ్యతగా ఉండేది. కానీ ఇప్పుడు మనం మన సంతోషానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే మనసులు కలవాలని చూస్తున్నారు. బలవంతపు బంధాల కంటే, ఇష్టపూర్వకమైన తోడు కోసం వేచి చూడటమే మేలని అనుకుంటున్నారు. వాళ్లకి నచ్చినప్పుడు నచ్చి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు’’ అని ఆమె అభిప్రాయపడింది. ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో చాన్స్ దక్కించుకుంటుంది. త్వరలో ఈ అమ్మడు ‘దో దినావే సెహర్ మే’ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతుంది. అలాగే ‘డెకాయిట్’ కూడా విడుదలకు సిద్ధమైంది. మృణాల్, అడివి శేష్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 19న ఉగాది కానుకగా రాబోతుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో మృణాల్ నటిస్తోంది.

వివాహంపై మృణాల్ క్లారిటీ ప్రకటన!

సినిమాలతో బిజీగా మృణాల్ ఠాకూర్!

మృణాల్ పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.