
Key Points
మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిల్జిత్ దోసాంజ్ ఫొటో షేర్ చేసింది.
దిల్జిత్ మెట్ గాలాలో సిక్కు మహారాజ్ లుక్‌లో కనిపించాడు.
మృణాల్ దిల్జిత్ లుక్‌ను చాలా ఇష్టపడినట్లు తెలిపింది.
‘లవ్ యూ మై బేబీ’ అంటూ మృణాల్ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.
మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టా పోస్ట్
‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదటి సినిమాతోనూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన అందం, నటనతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక మృణాల్ నటించిన ‘హాయ్ నాన్న’ కూడా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇక తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే మృణాల్ గత ఏడాది ‘కల్కి’ (kalki)సినిమాలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. మెట్ గాలాలో రెడ్ కార్పెట్‌పై నడిచిన నటుడు దిల్జిత్(Diljit)పై ఓ పోస్ట్ పెట్టింది.

