|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ మాస్ సంక్రాంతి కండిషన్! చిరు బ్లాస్టింగ్ స్టేట్మెంట్.. రికార్డులు పక్కా!

Updated: 07-01-2026, 2:14 PM
మెగాస్టార్ మాస్ సంక్రాంతి కండిషన్! చిరు బ్లాస్టింగ్ స్టేట్మెంట్.. రికార్డులు పక్కా!
  • సంక్రాంతికి అన్ని సినిమాలు విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్ష.
  • ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాలకు శుభాకాంక్షలు.
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన సినిమా షూటింగ్ సూపర్ ఫన్ అని చిరు వెల్లడి.
  • వెంకటేష్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆల్రెడీ హిట్ అని ప్రకటన.

సంక్రాంతి బాక్సాఫీస్ వార్‌కు రంగం సిద్ధమైంది! మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన చిత్రంతో పాటు ఈ పండుగకు విడుదలయ్యే అన్ని చిత్రాలు సంచలన విజయాలు సాధించాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఈ మెగా సందేశం సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది!

మెగాస్టార్ ఆల్-అవుట్ సంక్రాంతి విజన్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2026 సంక్రాంతిని తెలుగు చిత్ర‌సీమ మ‌ర్చిపోకూడ‌ద‌ని అన్నారు. అలాంటి సంక్రాంతిని ప్రేక్ష‌కులు ఇవ్వాల‌న్నారు. ఈ ఏడాది కామెడీ, ఎంట‌ర్టైన్మెంట్ తో ప‌ర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలు వ‌స్తున్నాయ‌న్నారు. త‌న సినిమాను మాత్ర‌మే కాకుండా అన్ని సినిమాల‌ను ఆశీర్వ‌దించాల‌న్నారు. ప్ర‌భాస్, న‌వీన్ పొలిశెట్టి, శ‌ర్వానంద్, ర‌వితేజ అందరి సినిమాలు మంచి విజ‌యం సాధించాల‌న్నారు. రాఘ‌వేంద్ర రావు ఒక‌ప్పుడు త‌న‌తో అనిల్ రావిపూడితో సినిమా చేయాల‌ని చెప్పార‌ని ఆయ‌న చేతులతోనే ఈ సినిమాకు క్లాప్ కొట్టార‌న్నారు.

సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర‌వాత అనిల్ రావిపూడి వ‌చ్చిన త‌న‌కు ఈ క‌థ చెప్పాడ‌న్నారు. త‌న‌కు క‌థ చాలా న‌చ్చింద‌ని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తైన త‌ర‌వాత ఫేవ‌ర‌ల్ పార్టీలా బాధ‌ప‌డ్డాన‌ని అన్నారు. ఇది వ‌ర‌కు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ రాలేద‌న్నారు. ప్ర‌తిరోజు షూటింగ్ చాలా స‌ర‌దాగా సాగేద‌ని చెప్పారు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత స‌ర‌దాగా చేసిన సినిమా లేద‌న్నారు. ఈ సినిమా ఆల్రెడీ సూప‌ర్ హిట్ అయింద‌న్నారు. అనుకున్న రోజుల్లో సినిమా పూర్తి చేశాడ‌ని, అనుకున్న బ‌డ్జెట్ లోనే అనిల్ సినిమా పూర్తి చేశాడు కాబ‌ట్టి ఆల్రెటీ హిట్ అయింద‌న్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ తో న‌టించడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అత‌డు మోడ్ర‌న్ గురూజీలా క‌నిపిస్తాడ‌న్నారు. వెంకీతో షూటింగ్ చేసినట్టు లేదని చాలా ఎంజాయ్ చేశామన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు సినిమా హిట్టేనా?

వెంకటేష్‌తో మెగాస్టార్ మజా మామూలుగా లేదా?

మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు ఈ సంక్రాంతి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేది పక్కా! ఆయన ఆశీస్సులు, సినిమాపై ఆయనకున్న నమ్మకం చూస్తుంటే, బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.