
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్, ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యతో కలిసి ఆమె నటించే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
Key Points
మృణాల్ ఠాకూర్ త్వరలోనే కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
సూర్య 'రెట్రో' సినిమా తర్వాత వెంకీ అట్లూరితో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ ఆ సినిమాలో సూర్యకు జోడీగా నటించే అవకాశం ఉంది.
ఈ కాంబినేషన్ పక్కా బ్లాక్ బస్టర్ అని అభిమానులు భావిస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ప్రవేశం
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘సీతా రామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ మూవీతో ఇండస్ట్రీలో తన క్రేజ్ మరింత పెంచుకుంది. తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగులో ‘డెకాయిట్’ చిత్రంతో పాటు.. హిందీలో నాలుగు మూవీస్ చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోలీవుడ్(Kollywood)లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
సూర్య తదుపరి చిత్రం
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సూర్య (Surya) తాజాగా ‘రెట్రో’ (Retro) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నాడు. ఇక మూవీ అనంతరం ఈ హీరో వెంకీ అట్లూరితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొనగా.. దీనికి సంబంధించిన షూటింగ్ మే నుండి ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. వీరిద్దరి కాంబోలో మూవీ అంటే పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మృణాల్-సూర్య కాంబినేషన్
A post shared by Mrunal Thakur (@mrunalthakur)
మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీతో ఆమె అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సినిమా విజయవంతం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.


