|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి విశ్వరూపం: ‘శంకర వరప్రసాద్’ కలెక్షన్ల సునామీ! 500 కోట్ల దిశగా దూకుడు!

Published: 17-01-2026, 1:15 AM
చిరంజీవి విశ్వరూపం: 'శంకర వరప్రసాద్' కలెక్షన్ల సునామీ! 500 కోట్ల దిశగా దూకుడు!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతికి విడుదలై రికార్డులు సృష్టిస్తోంది.
  • నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
  • తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 74 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

నాలుగు రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు

MSGV Collections : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. జనవరి 12న థియేటర్లోకి వచ్చిన మూవీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకున్న చిరంజీవి సినిమా రోజురోజుకీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ మూత మోగిస్తుంది. పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించడంతో వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. మూడు రోజులకు గాను 160 కోట్ల వరకు వసూలు చేసిన చిత్రం నాలుగు రోజులకు 200 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..

సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ రోజుకు రోజుకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. చిత్రం రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అవుతోంది.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు టికెట్స్ దొరకడం కష్టం అవుతుంది. నాల్గవ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. మొదటి నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 74 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి.. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజులకు గాను దాదాపు 160 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఇదే లెక్కన ఈ వీకెండ్ కనక కొనసాగితే కచ్చితంగా 200 కోట్లకు పైగా వసూళ్లను అందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మొదటి వారంలోనే ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్లే.. ఈనెల పూర్తయ్యలోగా 500 కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.

ఏ ఏరియాలో ఎంత వసూల్ చేసిందంటే…

500 కోట్ల మార్క్ అందుకుంటుందా?

ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే..నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 74 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి.. అలాగే కర్ణాటక 7 కోట్లు, ఓవర్సీస్ నుండి 13 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. సీడెడ్ ప్రాంతం నుండి 10 కోట్ల 75 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 9 కోట్ల 25 లక్షలు,గుంటూరు 7 కోట్లు, గోదావరి జిల్లాల్లో 13 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 5 కోట్ల 46 లక్షలు వసూళ్లను అందుకుంది. మొత్తానికి మూవీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.. మరి 500 కోట్లు వసూల్ అవుతాయేమో చూడాలి.. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే వీటి గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది..

మొత్తానికి చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే, త్వరలోనే 500 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.