|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSVG విధ్వంసం: ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్! మెగాస్టార్ స్టామినాకి బాక్సాఫీస్ షేక్!

Published: 18-01-2026, 2:00 AM
MSVG విధ్వంసం: ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్! మెగాస్టార్ స్టామినాకి బాక్సాఫీస్ షేక్!
  • మెగాస్టార్ మాస్ జాతర: ఆరు రోజుల్లోనే బ్రేకీవెన్ పూర్తి చేసుకున్న శంకర వరప్రసాద్ గారి చిత్రం!
  • ఏపీ, తెలంగాణలో ఐదవ రోజు రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు! ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్!
  • సంక్రాంతి కానుకగా విడుదలై అనిల్ రావిపూడి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్!
  • వింటేజ్ లుక్ మెగాస్టార్ వీరవిహారానికి థియేటర్లకు పోటెత్తిన ప్రేక్షకులు, అదనపు షోలు!

మెగాస్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేకీవెన్ పూర్తి చేసుకుని రికార్డులు కొల్లగొడుతోంది. అభిమానులకు ఇది నిజంగా పండగ వార్త!

మాస్ జాతరకు బ్రేక్ లేదు!

MSVG Collections: మెగాస్టార్ మెగా ర్యాంపేజ్ ఆగడం లేదు. విడుదలై ఆరు రోజులు గడుస్తున్నా ఆ ఊచకోత మాత్రం తగ్గడం లేదు. సెంటర్ తో సంబంధం లేకుండా మన వరప్రసాద్ చేస్తున్న మాస్ జాతరకు కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. కేవలం అయిదు రోజ్జుల్లోనే రూ.199 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేకీవెన్ కంప్లీట్ చేసుకొని ఈ సీజన్ లో క్లీన్ హిట్ గా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు(MSVG Collections) సినిమా.

రికార్డులు బ్రేక్ చేసిన MSVG

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తెరపై వింటేజ్ లుక్ మెగాస్టార్ చేసిన వీరవిహారానికి చిన్నా, పెద్దా అని తేడా లేకుండా థియేటర్స్ కి పరుగులు పెట్టారు. చోట్ల అదనపు షోలు వేసే పరిస్థితి ఏర్పడింది. సీట్లు సరిపోక వేరే కుర్చీలు వేసుకొని మరీ సినిమా చేస్తున్నారు ప్రేక్షకులు. ఒక సినిమాను ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం గత కొన్నేళ్లలో ఐదు మొదటిసారి అవడం విశేషం.

థియేటర్స్ వద్ద అభిమానుల సందడి

ఇక కలెక్షన్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది మన శంకర వరప్రసాద్ గారు సినిమా. వరుసగా 5వ రోజు ఏపీ అండ్ తెలంగాణలో రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆర్ఆర్ఆర్ మూవీ పేరిట ఉన్న రికార్డ్ ను కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగాస్టార్ అభిమానులకు పండగే పండుగ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.