
మహేశ్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా చిత్రీకరణకు తాత్కాలిక విరామం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా సంగీతంపై దృష్టి పెట్టారు. కీరవాణితో చర్చలు జరుగుతున్నాయి.
Key Points
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమాకు స్మాల్ బ్రేక్
ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్ పై దృష్టి
వచ్చే నెలలో సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం
సినిమాకు స్మాల్ బ్రేక్
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది యూనిట్. ఈ గ్యాప్‌లో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్‌పై ఫోకస్ పెట్టారట రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కలిసి ఈ సినిమాలోనిపాటలు, ఆర్‌ఆర్ ఎలా ఉండాలన్న విషయాలపై చర్చలు జరుపుతున్నారట రాజమౌళి.
మ్యూజిక్ వర్క్స్ ప్రారంభం
ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారట కీరవాణి. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ మరో కీలకపాత్రలో నటిస్తారని, ఈ సినిమా కథ కథనం, భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
వచ్చే నెలలో షూటింగ్
ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే… ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏదైనా వస్తే బాగుంటుందని మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి… మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.


