|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా!

Published: 07-11-2025, 5:31 PM
నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా!

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుండి ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, మోహిత్ చౌహాన్ గాత్రంలో వచ్చిన ఈ పాటలో రామ్ చరణ్ హుషారైన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. జాన్వీ కపూర్ గ్రేస్ ప్రత్యేక ఆకర్షణ.

Key Points

1

'పెద్ది' చిత్రం నుండి 'చికిరి చికిరి' తొలి లిరికల్ సాంగ్ విడుదల చేయబడింది.

2

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.

4

రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూమెంట్స్, జాన్వీ కపూర్ గ్రేస్ అద్భుతంగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.

‘చికిరి చికిరి’ పాట విడుదల వివరాలు

‘చికిరి చికిరి…’ అంటూ హుషారైన స్టెప్పులేశారు రామ్‌చరణ్‌. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి…’ అంటూ సాగే తొలి లిరికల్‌ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు.

‘చికిరి చికిరి… నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా…’ అంటూ ఈ పాట సాగుతుంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్‌ చౌహాన్‌ పాడగా, జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫోక్‌ ఎనర్జీ, మోడ్రన్‌ బీట్స్‌తో ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాట అదిరి పో తుంది. రామ్‌చరణ్‌ రాకింగ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్, హుక్‌ స్టెప్స్, జాన్వీ కపూర్‌ గ్రేస్, చార్మ్‌ అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

రామ్ చరణ్ డ్యాన్స్ హైలైట్స్

చిత్ర యూనిట్ అభిప్రాయం

‘చికిరి చికిరి’ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే విశేష ఆదరణ పొందింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ, ఏఆర్ రెహమాన్ సంగీతం ‘పెద్ది’ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.