
నవంబర్ 7న విడుదల కానున్న ‘ప్రేమిస్తున్నా’ సినిమాతో సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమా చేస్తున్న తమ్ముడిపై పూరి ఆకాష్ గర్వం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రోషన్ కనకాల చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Key Points
'ప్రేమిస్తున్నా' నవంబర్ 7న థియేటర్లలో విడుదల.
సాత్విక్ వర్మ డెబ్యూ హీరోగా నటించారు.
తమ్ముడి డెబ్యూపై పూరి ఆకాష్ గర్వం వ్యక్తం చేశారు.
సాత్విక్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆకాష్ ప్రశంస.
‘ప్రేమిస్తున్నా’ సినిమా విశేషాలు
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో మర్రి రవికుమార్ నిర్వాహణలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ‘ప్రేమిస్తున్నా’(premistunna). సాత్విక్ వర్మ(Satwik Verma), ప్రీతి నేహా (Preeti Neha)హీరో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ… ఒక చిత్రం విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసు. ‘ప్రేమిస్తున్నా’ అందరి ఆశీస్సులతో నవంబర్ 7న విడుదల కానుంది. సాత్విక్ నటన చాలా బాగుంటుంది. డెబ్యూ హీరోలా కాకుండా బాగా చేశాడు. మూవీ యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలిపారు. అనంతరం పూరి ఆకాష్ మాట్లాడుతూ.. హీరో సాత్విక్ తనకు తమ్ముడిలాంటివాడని, చిన్నప్పటి నుండి సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. సాత్విక్ ఎన్నో ఆడిషన్లు ఇచ్చి, తన సొంత కష్టం మీద ఎదిగాడని, అతను ఒక నిజమైన నటుడని ప్రశంసించారు. ‘ప్రేమిస్తున్నా’ టీజర్, పాటలు చూసినప్పుడు సాత్విక్ నటన మూవీకి ప్రధాన ఆకర్షణ అని, అతని నటన కోసమైనా ‘ప్రేమిస్తున్నా’ చూడాలనిపిస్తుందని అన్నారు.
పూరి ఆకాష్: తమ్ముడి డెబ్యూపై గర్వం
రోషన్ కనకాల ఆశీస్సులు
మొత్తంగా, ‘ప్రేమిస్తున్నా’ సినిమాతో సాత్విక్ వర్మ డెబ్యూను పూరి ఆకాష్, రోషన్ కనకాల వంటి యువ హీరోలు స్వాగతించారు. సాత్విక్ నటన సినిమాకు హైలైట్ అని చెబుతూ, ఈ ప్రేమకథ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.


