|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘బైకర్’ విజయంపై రామ్ చరణ్ ఆనందం! స్నేహితుడి సక్సెస్‌ను కొనియాడిన మెగాస్టార్!

Published: 05-04-2026, 10:35 AM
‘బైకర్’ విజయంపై రామ్ చరణ్ ఆనందం! స్నేహితుడి సక్సెస్‌ను కొనియాడిన మెగాస్టార్!
  • రామ్ చరణ్ ‘బైకర్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
  • శర్వానంద్ నటనను చరణ్ ప్రత్యేకంగా అభినందించారు.
  • యూవీ క్రియేషన్స్ వారిని చరణ్ అభినందించారు.
  • డైరెక్టర్ అభిలాష్ రెడ్డిని రామ్ చరణ్ ప్రశంసించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు శర్వానంద్ నటించిన ‘బైకర్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా మంచి విజయం సాధించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

రామ్ చరణ్ ‘బైకర్’ చిత్రంపై ప్రశంసలు

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా తన సినిమా పనులలో బిజీగా ఉంటూనే చరణ్ ఇతర సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమా పట్ల తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తన ప్రాణ స్నేహితుడు శర్వానంద్ ఇటీవల నటించిన బైకర్ సినిమా గురించి ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. బైకర్ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3వ తేదీ విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు పెద్ద ఎత్తున ప్రశంశల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం బైకర్ సినిమా గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బైకర్ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను వింటున్నాను. బైకర్ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి సరికొత్త కాన్సెప్టును ఎంపిక చేసుకొని, నిర్మాణ విషయంలో ఏ విధమైనటువంటి రాజీ లేకుండా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన యూవీ క్రియేషన్ వారికి హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్ చేశారు.

ఇక తన స్నేహితుడు శర్వానంద్ గురించి కూడా ఈ సందర్భంగా చరణ్ స్పందిస్తూ.. నా ప్రియమైన స్నేహితుడు శర్వానంద్ తన నటన నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రాజశేఖర్ గారి పాత్రకు పాజిటివ్ టాక్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు . ఈ సినిమాని చాలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి పై కూడా చరణ్ ప్రశంసలు కురిపించారు. ఇలా మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే చూడటానికి ప్రయత్నం చేస్తానంటూ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

శర్వానంద్ నటనను అభినందించిన చరణ్

Hearing wonderful things about #Biker and so happy to see it doing so well ❤️

Hats off to @UV_Creations for backing a unique concept with such conviction and mounting it on a grand scale without compromise. Truly commendable.

Glad to see my dearest friend @ImSharwanand …

యూవీ క్రియేషన్స్‌పై ప్రశంసల వర్షం

— Ram Charan (@AlwaysRamCharan) April 5, 2026

ఈ పోస్ట్ పెట్టి చూస్తుంటే రామ్ చరణ్ ఇంకా ఈ సినిమా చూడలేదని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈయన పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా చూడలేదని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ విన్న చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు ఈయన చేసిన పోస్ట్ పై నటుడు రాజశేఖర్ స్పందిస్తూ థాంక్యూ రాంచరణ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక చరణ్ పెద్ది సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల అవుతుందా లేదా అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు కానీ ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మొత్తానికి రామ్ చరణ్ తన స్నేహితుడి సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే సినిమా చూస్తానని ఆయన పేర్కొన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.