
📌 Key Points
- “మిస్టీరియస్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
- ఇదొక కొత్త స్క్రీన్ ప్లేతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అని దర్శకుడు తెలిపారు.
- బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
- డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లలో విడుదల కానుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ “మిస్టీరియస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర విశేషాలు కింద చూడండి.
“మిస్టీరియస్” దర్శక నిర్మాతల మాటలు
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న “మిస్టీరియస్” నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా.. నిర్మాత గారు చాలా పట్టుదలతో తీశారు. సినిమా చేస్తున్న టైంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఒక కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని చెప్పారు.
ముఖ్య అతిథి బ్రహ్మానందం ప్రసంగం
ఇక నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ మహితో కలిసి మూవీ చేస్తామని అనుకోలేదు. కానీ, మిస్టీరియస్ అది జరిగింది. ఈ మూవీ స్టోరీ మహి చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. అందుకే కష్టపడి చేశాం. మా ఈవెంట్‌కు బ్రహ్మానందంగారు గెస్ట్ రావడం హ్యాపీగా ఉంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 12 వ తేదీ రోజున ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్ లో విడుదల చేయాలనీ అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తమ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సహా నిర్మాత ఉషా, శివానీ మాట్లాడుతూ, ‘సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉందని అన్నారు.
విడుదల తేదీ, సినిమా హైలైట్స్
హీరో రోహిత్ మాట్లాడుతూ.. మా మూవీ ఈవెంట్‌కు బ్రహ్మానందం గారు రావడం చాలా స్పెషల్. సినిమా కోసం అందరం చాలా కష్ట పడ్డాం. చాలా ప్రేమతో ఈ సినిమాను చేశాం. ఈ సినిమాకు నన్ను ఎంచుకున్నందకు డైరెక్టర్ మహి సార్‌కి, ప్రొడ్యూసర్ జై సార్ కి థాంక్యూ. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బ్రహ్మానందం ఫస్ట్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం గారు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించకపోయినా.. రావడానికి కారణం.. ఈ మూవీ ఎంటైర్ టీంలో నాకు తెలిసిన వ్యక్తి డైరెక్టర్ మహి మాత్రమే. ఇతనికి సంబంధించిన ఒక మొమోరీ పంచుకోవడానికి వచ్చాను. 1985 ఫిబ్రవరి 1వ తేదీ నేను మొదటిగా చేసిన సినిమా శ్రీ తాతావతరం కథ చేశాను. హీరో నరేష్ గారి కాలేజ్ ఫ్రెండ్స్ పాత్రలుగా నేను మహి కలిసి నటిచాము. నా సినిమా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మహి నా స్నేహితుడు. అందుకే ఈ మూవీ ఈవెంట్ కి వచ్చాను. మంచి నటీనటులను, యంగ్ స్టార్స్‌ను, కాస్ట్ అండ్ క్రూలను పట్టుకుని మంచి సినిమా చేశారు. టైటిల్ కూడా అద్భుతంగా పెట్టారు. సినిమాలో ఓ సస్పెన్స్ పెట్టి.. లాస్ట్ 20 మినిట్స్ వరకు ఏం జరిగింది అంటూ ఇంట్రెస్ట్ ఉండేలా సినిమా చేశారు. ఇలాంటి సినిమాను సపొర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటాను.
“మిస్టీరియస్” టీమ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నారు. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


