|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు (జూలై 14, 2025): ఆస్తి కొనుగోలు, నాగ సింధూరం

Published: 13-07-2025, 6:46 PM
నేటి రాశి ఫలాలు (జూలై 14, 2025): ఆస్తి కొనుగోలు, నాగ సింధూరం

జూలై 14, 2025 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు కొన్ని రాశులకు ఆస్తి కొనుగోలు అనుకూలంగా ఉండగా, మరికొన్నింటికి పరిహారాలు సూచించబడ్డాయి. నాగ సింధూరం ధరించడం, పూజలు చేయడం వంటి విషయాలను కూడా తెలుసుకుందాం.

Key Points

1

జూలై 14, 2025 నాటి రాశిఫలాలు

2

ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు (కొన్ని రాశులకు)

4

వివిధ రాశులకు అనుకూలమైన పూజలు, నివారణలు

వివిధ రాశులకు దిన ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : ధనిష్ట

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. వృత్తి, వ్యాపారములు, రాజకీయ పరమైన వ్యవహారములు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. నిత్యం యజ్ఞ భస్మాన్ని ధరించడం వలన యజ్ఞము చేసిన ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడిపోయి ఊపిరి పీల్చుకుంటారు.

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన మార్పులు, చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాధరణ బాగుంటుంది. ప్రచార సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పగణపతి పీఠానికి పరిమళగంధం రాసి, ఆరావళి కుంకుమ పెట్టి నిత్యం పూజ చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి.

ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. పిల్లల విద్యా విషయమై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డబ్బు ఖర్చు పెడతారు, కొంతమందికి వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. మహాతీతం పొడితో చేసే అభిషేకాలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి.

ఆర్థిక పురోగతికి సూచనలు

కర్కాటక రాశి వారికి ఈరోజు సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలేనని నిరూపిస్తారు. ముఖ్యమైన సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. నిత్యం లక్ష్మీదేవికి పరిమళగంధం, ఆరావళి కుంకుమతో పూజ చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం.

సింహ రాశి వారికి ఈ రోజు పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. విద్యార్థినీ విద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని ధరించడం, జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తీరుతాయి. ప్రతినిత్యం ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశాలలో కానీ కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు చాలా అవసరం. జీవిత భాగస్వాముల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వస్త్రాలాభం.

తుల రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. హనుమాన్ వత్తులు, అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన వేయటం వలన నరదృష్టి, శత్రుపీడ మొదలైనవి తొలగిపోతాయి.

ఈ రాశి వారికి ఈరోజు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వుంటుంది. ఇంటా బయటా కొంత వరకు అనుకూలంగా వుంటుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. పారిశ్రామిక, రాజకీయ, కళా రంగాలలో ఉన్న వారికి కొంత అనుకూలంగా వుంటుంది. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. నిత్యం సర్వదోష నివారణ కంకణం ధరించండి.

ధార్మిక పరిహారాలు

ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి ఉన్నా ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిత్యం దీపారాధన కుండిలో రెండు చుక్కలు పరిమళగంధం వేయండి. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది.

ఈ రాశి వారికి ఈ రోజు విందులు, వినోదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని విందులు, వినోదాలకు వెళ్ళవలసి వస్తుంది. ఎదుటివారి అంతరంగం అర్థం అవుతుంది. నూతన వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తారు. ఒక విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. నిత్యం నాగ సింధూరం ధరించడం అన్ని విధాలా మంచిది.

కుంభ రాశి వారికి ఈ రోజు పెళ్ళికాని వారు, ఉద్యోగం లేని వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. రాజకీయ సంబంధమైన వ్యవహారాలలో స్వల్పమైన ప్రయోజనాలకు సంతృప్తి చెందుతూ, మీ సామాజిక వర్గాన్ని నష్టానికి దారితీసే పరిస్థితిని కల్పిస్తారు. దీని వల్ల మీకు మానసిక పరివర్తనం కలుగుతుంది.

ఈ రాశి వారికి ఈ రోజు పోటీ పరీక్షలలో నెగ్గి గొప్ప ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పులు చేయడం లేదా ఒక రంగం నుండి మరొక రంగంలోకి మారడం సంభవించవచ్చు. నిత్యం జువ్వాజి పూజలో ఉపయోగించదగినది. వృత్తి, ఉద్యోగాల పరంగా శారీరక, మానసిక వత్తిడి అధికంగా వుంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వుంటాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000

ఈ రాశిఫలాలు మార్గదర్శకంగా మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు మీ స్వంత వివేచనను ఉపయోగించండి. శుభం జరుగుగాక!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.