|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు జూలై 26, 2025: నిరుద్యోగులకు శుభవార్తలు, డబ్బు, సూర్యారాధన

Published: 25-07-2025, 6:44 PM
నేటి రాశి ఫలాలు జూలై 26, 2025: నిరుద్యోగులకు శుభవార్తలు, డబ్బు, సూర్యారాధన

జూలై 26, 2025 నాటి రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు, ఆర్థిక లాభాలు, మరియు ఆధ్యాత్మిక సూచనలు ఈ ఫలాలలో ఉన్నాయి. ప్రతి రాశికి వివరణాత్మక సూచనలు తెలుసుకుందాం.

ప్రతి రాశి వారికి దిన ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 26.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ, వారం : శనివారం, తిథి : శు. విదియ, నక్షత్రం : ఆశ్లేష

మేష రాశి వారికి ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధు మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చేస్తున్న వృత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి వారికి వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి. నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టడం అవసరం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులను కొంటారు. రామాలయాన్ని సందర్శించండి.

ఆర్థిక మరియు ఉద్యోగ అవకాశాలు

కర్కాటక రాశి ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరిగినా అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.

సింహ రాశి విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో అవకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధు మిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. పెద్దల సలహాలు పాటించడం అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి.

కన్య రాశి వారికి ఇంటా, బయటా అనుకూల వాతావరణం. ఆలస్యంగా అయినా అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధు మిత్రులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శివారాధన శుభప్రదం.

తుల రాశి వారి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధు మిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శివారాధన శుభప్రదం.

ఆధ్యాత్మిక సూచనలు

బంధు మిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మకర రాశి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. రావలసిన డబ్బు చివరి నిమిషంలో చేతికి అందుతుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. దత్తాలయాన్ని సందర్శించండి.

మీన రాశి వారి వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీలలో ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000

ఈ రాశి ఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది. శుభం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.