|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nabha Natesh: చెట్టును ఆలింగనం చేసుకున్నా.. అది కూడా తిరిగి నన్ను..

Published: 05-06-2025, 10:44 AM
Nabha Natesh: చెట్టును ఆలింగనం చేసుకున్నా.. అది కూడా తిరిగి నన్ను..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నభా నటేష్ చేసిన ఒక ప్రత్యేకమైన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చెట్టును ఆలింగనం చేసుకున్న ఆమె అనుభవాన్ని పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Key Points

1

నభా నటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్టును కౌగిలించుకున్నారు.

2

ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

4

ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి.

నభా నటేష్ చెట్టును కౌగిలించుకున్నారు

హీరోయిన్ నభా నటేష్ ( Nabha Natesh ).. ఈ రోజు (జూన్‌ 5న) ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( World Environment Day ) సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను… ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్‌కు రుణపడి ఉంటాను అని రాసుకొచ్చింది.

ఎమోషనల్ పోస్ట్

ఇది చూసిన నెటిజన్లు ప్రకృతి గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నభా నటేష్.. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో నాగాభరణం అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగాభరణం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి.

చిత్ర పరిశ్రమలో నభా నటేష్ కెరీర్

ప్రకృతి ప్రేమను చాటుకుంటూ నభా నటేష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో విడుదల కానున్న సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.