|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నభా నటేష్ షాకింగ్ థ్రోబ్యాక్స్: నెటిజన్ల దృష్టి ఆమె ఫ్రెండ్‌పైనే.. వైరల్ కామెంట్స్!

Published: 29-12-2025, 2:31 AM
నభా నటేష్ షాకింగ్ థ్రోబ్యాక్స్: నెటిజన్ల దృష్టి ఆమె ఫ్రెండ్‌పైనే.. వైరల్ కామెంట్స్!
  • నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ‘ఇస్మార్ట్ శంకర్’తో పాపులర్ అయ్యింది.
  • ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.
  • తన ఇన్‌స్టాలో ఇంజనీరింగ్, చిన్ననాటి, ప్రొఫెషనల్ షూట్, ఐరన్ మ్యాన్ గెటప్ వంటి థ్రోబ్యాక్ ఫొటోలు షేర్ చేసింది.
  • ‘నీకంటే నీ పక్కన ఉన్న ఫ్రెండే బాగుంది’ అంటూ నెటిజన్ల నుంచి ఫన్నీ, వైరల్ కామెంట్స్ వెల్లువెత్తాయి.

నభా నటేష్, తన సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేస్తూ కొన్ని పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ థ్రోబ్యాక్ పిక్స్‌లో ఆమె ఇంజనీరింగ్, చిన్ననాటి క్షణాలను చూపింది. అయితే, వీటిపై నెటిజన్లు ఆశ్చర్యకరమైన కామెంట్స్‌తో వైరల్ అవుతున్నాయి.

నభా నటేష్ కెరీర్, సోషల్ మీడియా హంగామా

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

వైరల్ అవుతున్న అరుదైన థ్రోబ్యాక్ పిక్స్

అందులో.. ‘నా జీవితంలోని యాదృచ్ఛిక దశలకు తిరిగి వెళ్తున్నాను.. vfx* – మూడవ స్లయిడ్ టైపింగ్ తప్పుగా పడింది’ అని రాసుకొస్తూ గతంలో తీసుకున్న కొన్ని ఫొటోస్‌ను షేర్ చేసింది. ఇక వాటిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డే, ఫస్ట్ ప్రొఫెషనల్ ఫొటో షూట్, చిన్నప్పటి ఫొటో, ఐరన్ మ్యాన్ గెటప్‌లో ఉన్న పిక్, స్టేజ్ పర్ఫామెన్స్ ఫొటో, తన ఫస్ట్ సాంగ్ ఫిక్, పీజెంట్ డేస్ పిక్, ఇస్మార్ట్ శంకర్ మూవీ పోస్టర్, చిన్నప్పుడు టైగర్‌ను చూసిన ఫొటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫొటోస్‌లో ఉన్న నభాకు ఇప్పుడు ఉన్న నభాకు చాలా తేడా ఉంది. ఇక వాటిని చూసిన నెటిజన్లు గుర్తు పట్టడం కష్టంగానే ఉందిగా అని, నీ కంటే నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్రెండ్‌పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

A post shared by Nabha Natesh (@nabhanatesh)

నభా నటేష్ షేర్ చేసిన థ్రోబ్యాక్ ఫొటోలు ఆమె అభిమానులకు ఆనందాన్నిచ్చాయి. అయితే, ఆమె ఫ్రెండ్‌పై వచ్చిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇది ఆమె పోస్ట్‌కు మరింత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.