
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’ మరియు ‘మహానటి’ సినిమాలు అవార్డులను అందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Key Points
నాగ్ అశ్విన్ 'కల్కి' మరియు 'మహానటి' సినిమాలకు తెలంగాణ గద్దర్ అవార్డులు అందుకున్నారు.
'కల్కి' చిత్రం కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డామని, ప్రభుత్వ గుర్తింపు సంతోషంగా ఉందని నాగ్ అశ్విన్ తెలిపారు.
బాక్సాఫీస్ విజయాల కంటే అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ గద్దర్ అవార్డులు
గత నెల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇందులో 2014 నుంచి 2022 వరకు ఒక్కో సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు అవార్డులను ప్రకటించగా.. పలువురికి ఈ గౌరవం దక్కింది. అయితే ఇందులో నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన కల్కి, మహానటి(mahanati) సినిమాలకు అవార్డులు వచ్చాయి. తాజాగా, ఈ విషయంపై స్పందించిన నాగ్ ఆశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “కల్కి సినిమా చేయడానికి మాకు ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ చిత్రం కోసం ఎంతోమంది భారతదేశ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు లేని ఒక గొప్ప విజువల్ వండర్ ను రూపొందించాము. దానికిగాను ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది.
నాగ్ అశ్విన్ స్పందన
ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చినప్పటికీ తర్వాత మన తెలంగాణ గద్దర్ అవార్డు రావడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గద్దర్ అవార్డును ప్రారంభించి ముందుకు తీసుకు వెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం ఈ సంవత్సరం కాకుండా ఎన్ని సంవత్సరాలుగా చేసిన సినిమాలన్నిటిని గుర్తించి అవార్డులు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. సినీ రంగంలో బాక్సాఫీస్ రికార్డుల కంటే ఎటువంటి అవార్డులు అనేవి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాయి.
కల్కి మరియు మహానటి విజయం
ప్రభుత్వం నుండి వచ్చే ఇటువంటి గుర్తింపులు మమ్ములను మరింత ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. అలాగే 2018 లో వచ్చిన మహానటి చిత్రానికి కూడా ఇన్ని సంవత్సరాలకు బెస్ట్ చిత్ర అవార్డు ఇచ్చినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకుగాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ప్రస్తుతం నాగ్ ఆశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘కల్కి-2’ తెరకెక్కిస్తున్నారు. ‘కల్కి’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవ సినీ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తుందని, కళాకారులకు ప్రోత్సాహం ఇస్తుందని నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరింత మంచి సినిమాలు తీయడానికి ఇది ఉత్తేజాన్నిస్తుందని తెలిపారు.


