|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Naga Chaitanya: నాన్నలాగా చేయాలన్నదే నా డ్రీమ్.. నాగచైతన్య

Published: 05-10-2025, 6:42 PM
Naga Chaitanya: నాన్నలాగా చేయాలన్నదే నా డ్రీమ్.. నాగచైతన్య

టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఇటీవల తండేల్ విజయంతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్, తదుపరి చిత్రం వృషకర్మ గురించి మాట్లాడారు. అంతేకాకుండా, తన తండ్రి నాగార్జున వలె పౌరాణిక పాత్రలు చేయాలన్న తన కలను పంచుకున్నారు.

Key Points

1

తండేల్ సినిమాతో నాగ చైతన్య ఖాతాలో సూపర్ హిట్ చేరింది.

2

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' (NC24) చేస్తున్నారు.

4

నాన్న నాగార్జునలా మైథలాజికల్ పాత్రలు చేయాలని నాగ చైతన్య కోరిక.

నాగ చైతన్య: తండేల్ విజయం, వృషకర్మ వివరాలు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ ‌ హిట్ ‌ తన ఖాతాలో వేసుకున్నారు . చందు మొండేటి డైరెక్షన్ ‌ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది . ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు డైరెక్షన్ ‌ లో పని చేస్తున్నారు . వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్‌ టైటిల్‌) ఖరారు చేశారు . ఇది నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్ ‌ కు హాజరయ్యారు . టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ ‌ చేస్తున్న జయమ్ము .. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్ ‌ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు . తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు . నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు . ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు .

జగపతిబాబు షోలో చైతూ ఆసక్తికర విషయాలు

నాన్నలా మైథలాజికల్ సినిమాలు చేయాలనే కల

నాగ చైతన్య తన కలను బయటపెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన పౌరాణిక పాత్రలలో కనిపించాలని కోరుకుంటున్నారు. చైతూ కెరీర్‌లో ఇవి కొత్త మలుపులు తేగలవని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.