|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వృషకర్మ తర్వాత నాగ చైతన్య తదుపరి చిత్రం ఏంటో తెలుసా? డైరెక్టర్ క్లాక్స్ తోనే!

Published: 16-12-2025, 12:04 AM
వృషకర్మ తర్వాత నాగ చైతన్య తదుపరి చిత్రం ఏంటో తెలుసా? డైరెక్టర్ క్లాక్స్ తోనే!
  • నాగ చైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.
  • కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’పై భారీ అంచనాలున్నాయి.
  • ‘బెదురులంక’ దర్శకుడు క్లాక్స్ కథకు నాగ చైతన్య పూర్తి ఇంప్రెస్ అయ్యారు.
  • వృషకర్మ తర్వాత నాగ చైతన్య, క్లాక్స్ కాంబోలో సినిమా అధికారిక ప్రకటన త్వరలో.

నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం వృషకర్మ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, వృషకర్మ తర్వాత చైతూ తదుపరి సినిమాపై ఆసక్తికర వార్త బయటికొచ్చింది. క్లాక్స్ దర్శకత్వంలో ఆయన కొత్త చిత్రం చేయనున్నారు.

నాగచైతన్య కెరీర్ గ్రాఫ్

Naga Chaitanya: జోష్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా సినిమా సక్సెస్ కాకపోవడానికి ఒక కారణం. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కొన్ని బెస్ట్ లవ్ స్టోరీస్ ప్రస్తావన వస్తే ఆ సినిమా కూడా ఒకటే వినిపిస్తుంది.

ప్రస్తుతం నాగచైతన్య వృషకర్మ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తీక్ దండు చేసిన విరూపాక్ష సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాయి తేజ్ కు పాన్ ఇండియా స్థాయి సక్సెస్ ఇచ్చింది ఆ సినిమా. సాయి తేజ్ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ కూడా ఆ సినిమా వసూలు చేసింది. విరూపాక్ష దర్శకుడు నుంచి వృషకర్మ సినిమా వస్తుండడంతో చాలా అంచనాలు నెలకొన్నాయి.

వృషకర్మ: చైతూ తొలి పాన్ ఇండియా చిత్రం

బెదురులంక సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు క్లాక్స్. కార్తికేయ గుమ్మకొండ నటించిన ఆ సినిమా డీసెంట్ సక్సెస్ సాధించుకుంది. ఇప్పుడు ఈ దర్శకుడు నాగచైతన్య కోసం కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో వస్తుంది.

క్లాక్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బెదురులంక సినిమాతోనే చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. వృషకర్మ సినిమా తర్వాత నాగచైతన్య ఈ ప్రాజెక్టు చేయనున్నట్లు సమాచారం. ఇదివరకే నాగచైతన్యతో సినిమాను నిర్మించిన ఒక సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. క్లాక్స్ చెప్పిన కథతో నాగచైతన్య కంప్లీట్ గా ఇంప్రెస్ అయిపోయారట. అందుకనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత డైరెక్టర్ క్లాక్స్ తో సినిమా చేయడానికి సిద్ధం అయిపోయాడు.

క్లాక్స్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు

ఇకపోతే వృషకర్మ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న సంగతి తెలిసి. నాగచైతన్య కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా కోసం చైతన్య విపరీతంగా కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూసినప్పుడే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఒక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

వృషకర్మ మరియు క్లాక్స్ తో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ రెండూ నాగ చైతన్య కెరీర్ కు కీలకమైనవి. ఈ చిత్రాల వివరాలు, విడుదల తేదీల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.