
📌 Key Points
- నాగచైతన్య, రుక్మిణి వసంత్ కాంబో ఫిక్స్ – టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్!
- NC24తో బిజీగా ఉన్న చైతన్య.. వెంటనే మరో ప్రాజెక్ట్ ఓకే చేశారా?
- వృషకర్మ టైటిల్‌తో మైథలాజికల్ థ్రిల్లర్‌గా NC24 – షూటింగ్ శరవేగంగా పూర్తి!
- త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ – న్యూ కాంబో కోసం నెటిజన్స్ వెయిటింగ్!
టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబో ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య, రుక్మిణి వసంత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
రుక్మిణి వసంత్‌తో చైతన్య న్యూ మూవీ?
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరుగా మారిపోయింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కవ సమయంలో ఊహించని విధంగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోస్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక ఈ ఏడాది ‘కాంతార: చాప్టర్ 1’లో నెగిటివ్ రోల్‌లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రజెంట్ వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు టాక్.
గతేడాది ‘తండేల్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగచైతన్య ప్రజెంట్ NC24తో బిజీగా ఉన్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చెయ్యగా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. నాగచైతన్య ప్రజెంట్ మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇందులో రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఈ కాంబో ఫిక్స్ కాగా.. అనౌన్స్‌మెంట్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్ నడుస్తుండగా.. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. న్యూ కాంబో లోడింగ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
NC24 అప్‌డేట్స్: వృషకర్మ షూటింగ్ అదుర్స్!
న్యూ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
ఇలాంటి క్రేజీ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటాం. నాగచైతన్య, రుక్మిణి వసంత్ కాంబో గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. అప్పటివరకు చూస్తూనే ఉండండి!


