|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగ‌దుర్గ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ధ‌నుష్ అల్లుడి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్‌?

Published: 28-10-2025, 3:15 AM
నాగ‌దుర్గ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ధ‌నుష్ అల్లుడి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్‌?

యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గకు బంపర్ ఆఫర్ దక్కింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీష్ రెండో సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన అదిరిపోయే డ్యాన్స్‌, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇది ఆమె అభిమానులకు శుభవార్త.

Key Points

1

యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గకు భారీ ఆఫర్ దక్కింది.

2

ధనుష్ మేనల్లుడు పవీష్ రెండో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ లభించినట్లు వార్తలు.

4

తెలుగులో ఇప్పటికే 'కలివి వనం' అనే సినిమాలో నాగదుర్గ నటించింది.

నాగదుర్గ పాపులారిటీ: యూట్యూబ్ సెన్సేషన్

దిశ‌, వెబ్ డెస్క్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగదుర్గ (Folk Dancer Naga Durga)పేరు తెలియని వారు ఉన్నారు. యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ.. ఎన్నో పాటల్లో కనిపించి అందరినీ అలరించింది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి, ఫోక్ సాంగ్స్ లో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో మరింత పాపులారిటీ తెచ్చుకుంది నాగదుర్గ. ఆమె సాంగ్ చేసిందంటే, మిలియన్స్ లో వ్యూస్ వచ్చేస్తాయి. ఆమె అందంతో పాటు, అదిరిపోయే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే అలాంటి అందాల తార నాగదుర్గకు బంపర్ ఆఫర్ తగిలింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్‌ ( paveesh) రెండో సినిమాలో నాగదుర్గకు ఛాన్స్ దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల పవీష్‌ రెండో సినిమాను పూజా కార్య‌క్ర‌మాలు చేసి, ప్రారంభించారు. జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన పవీష్‌.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు పనిలో పడ్డారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నాగదుర్గను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి నాగదుర్గ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగదుర్గ నటిస్తే తమిళ ఇండస్ట్రీ కూడా ఆమె పరిచయం అవుతారు. కాగా తెలుగులో ఇప్పటికే కలివి వనం అనే సినిమాలో నాగదుర్గ నటించిన సంగతి తెలిసిందే. క్లిక్

ధనుష్ మేనల్లుడి సినిమాలో ఛాన్స్

తమిళ పరిశ్రమకు నాగదుర్గ ఎంట్రీ?

నాగదుర్గ ఈ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టడం ఆమె కెరీర్‌కు పెద్ద మలుపు కానుంది. ఆమె పాపులారిటీ సినిమాకు ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.