
📌 Key Points
- నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీకి భారీ నష్టాలు, 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.
- తొలి రోజు కలెక్షన్లు దారుణం, కనీసం టీ ఖర్చులకు కూడా డబ్బులు రాలేదని సమాచారం.
- రామ్ దేశినా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
- శ్రీదేవి విజయ్ కుమార్, విధి యాదవ్ కీలక పాత్రల్లో నటించినా ఫలితం నిరాశజనకంగా ఉంది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నాగశౌర్యకు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసలు ఈ సినిమాకి ఎందుకు ఇంత దారుణమైన ఫలితం వచ్చింది?
30 కోట్ల బడ్జెట్.. అయినా ఫలితం శూన్యం!
నాగశౌర్య ఒకప్పుడు టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరో. `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు `దిక్కులు చూడకు రామయ్య`, `లక్ష్మీ రావే మాఇంటికి`, `జాదూగాడు`, `కళ్యాణ వైభోగమే`, `జ్యో అచ్చుతానంద`, `ఛలో` చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇటీవల ఆయనకు విజయాలు లేవు. దీంతో సినిమా సినిమాకి కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏ పరిస్థికి వచ్చిందంటే ఆయన సినిమా వస్తుందని కనీసం జనాలకు కూడా తెలియదు. ప్రమోషన్స్ లేకపోవడంతో ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. కొత్త హీరోల సినిమాల కంటే దారుణంగాఈ మూవీ రిజల్ట్ ఉండటం గమనార్హం.
నాగశౌర్య ఈ శుక్రవారం `బ్యాడ్ బాయ్ కార్తీక్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. రామ్ దేశినా దర్శకత్వం వహించగా, ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. విధి యాదవ్ హీరోయిన్‌గా చేసింది. సముద్రఖని, మైమ్ గోపి, నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ వంటి వారు నటించారు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. డిజాస్టర్ టాక్ వస్తోంది.
టీ ఖర్చులకు కూడా రాని వసూళ్లు.. షాకింగ్ నిజాలు!
ఇక ఈ మూవీ ఈ సినిమాని సుమారు రూ.30కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట. కానీ వసూళ్ల పరంగా చూస్తే దీనికి కనీసం యాభై లక్షలు కూడా రాలేదని ట్రేడ్ వర్గాల టాక్. సినిమా బిజినెస్ కాలేదు. ఓటీటీ అమ్ముడు పోలేదు, శాటిలైట్ కూడా కాలేదు. దీంతో నిర్మాత సొంతంగా రిలీజ్ చేశాడు. అంటే ప్రమోషన్స్ తోపాటు థియేటర్ల రెంట్ కట్టి సినిమాని రిలీజ్ చేశారు. కానీ థియేటర్ రెంట్ డబ్బులు కూడా రాలేదట. ఒక్కో థియేటర్లో ఐదు వేల లోపే వచ్చాయని, రెంట్‌లో సగం డబ్బులు కూడా రాలేదని టాక్. ఇంకా చెప్పాలంటే నిర్మాతకి థియేటర్ నుంచి టీ డబ్బులు కూడా రాలేదని చెప్పొచ్చు. ఇదే ఆశ్చర్యపరుస్తోంది.
నాగశౌర్య కెరీర్‌కు బ్యాడ్ బాయ్ కార్తీక్ బ్రేక్ ఇస్తుందా?
ఒకప్పుడు మంచి హీరోగా, కుర్ర హీరోగా ఎదిగిన నాగశౌర్య సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యపరుస్తోంది. నాగశౌర్య నిజానికి చాలా సౌమ్యుడు. అందరితోనూ బాగుంటాడు. ఎలాంటి గొడవలు, వివాదాలు లేవు. ఫ్యామిలీ హీరో టైప్. కానీ ఆయన సినిమా ఇలాంటి దారుణమైన రిజల్ట్ ని చవిచూడటం విచారకరం. సరైన కథలను ఎంచుకోవడంలో విఫలం కావడంతో ఆయా చిత్రాలు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో పరాజయం తప్పడం లేదు. ఇప్పుడు నటించిన `బ్యాడ్ బాయ్ కార్తీక్` కూడా రొటీన స్టోరీనే. ఇది అక్క, తమ్ముడు మధ్య సాగే కథ. ఇకపై అయినా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండే కథలను ఎంచుకుని నాగశౌర్య మళ్లీ కమ్ బ్యాక్ కావాలని కోరుకుందాం.
నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ కలెక్షన్ల గురించి తెలుసుకున్నాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.


