
📌 Key Points
- నాగ శౌర్య నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న విడుదల కానుంది.
- శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- ఈ చిత్రానికి రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నారు.
- జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.
హీరో నాగ శౌర్య నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ చిత్రానికి రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఏప్రిల్ 17న ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ విడుదల
Bad Boy Karthik: హీరో నాగ శౌర్య (Naga Shaurya)కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. చాలా కాలంగా ఆయన హిట్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఎంతగా ప్రయత్నించినా, ప్రేక్షకులు మాత్రం అంతగా వాటికి కనెక్ట్ కావడం లేదు. అందుకే ఈసారి, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ (Bad Boy Karthik). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, హై-వోల్టేజ్ సన్నివేశాలతో మాస్ యాటిట్యూడ్ నిండిన టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ వదిలారు. అదేంటంటే..
నిర్మాణ వివరాలు, దర్శకుడు
ఈ వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగాఈ సినిమాను ఏప్రిల్ 17న (Bad Boy Karthik Release Date) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో చేతిని పైకెత్తి పిడికిలి బిగించి పవర్ ఫుల్ లుక్‌లో నాగ శౌర్య కనిపిస్తున్నారు. ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం మరింత క్యురియాసిటీని పెంచుతోంది. ఈ సినిమా కచ్చితంగా తనకు విజయాన్ని ఇస్తుందని నాగ శౌర్య నమ్మకంగా చెబుతున్నారు. మేకర్స్ కూడా ఇందులో మంచి కథ, కంటెంట్ ఉన్నాయని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతాయని చెబుతున్నారు. మరి వారనుకున్న విజయం వరిస్తుందో, లేదో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే.
జీ స్టూడియోస్‌కు థియేట్రికల్ హక్కులు
ఇక ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సినిమాల డీల్స్ కష్టంగా మారిన సమయంలో ఈ సినిమా కోసం ఇంత త్వరగా డీల్ క్లోజ్ అవడం, సినిమా కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకాన్ని తెలియజేస్తోంది. జీ స్టూడియోస్‌తో ఈ భాగస్వామ్యం సినిమా క్రెడిబిలిటీని పెంచడమే కాకుండా, రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను కూడా తీసుకువచ్చిందని చెప్పొచ్చు. నాగ శౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆరెంజ్’ ఫేమ్ హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఏది ఏమైనా, ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ చిత్రం నాగ శౌర్యకు మంచి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఏప్రిల్ 17 వరకు వేచి చూడటం తప్ప మరో మార్గం లేదు.

