|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో హోటల్స్ మూత.. గ్యాస్ కష్టాలతో ఉషా మల్పూరి కన్నీళ్లు!

Published: 15-03-2026, 5:05 AM
హైదరాబాద్‌లో హోటల్స్ మూత.. గ్యాస్ కష్టాలతో ఉషా మల్పూరి కన్నీళ్లు!
  • హైదరాబాద్‌లో గ్యాస్ కొరతతో హోటల్స్ మూతపడుతున్నాయి.
  • హీరో నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి తన రెస్టారెంట్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు.
  • ఉషా మల్పూరి గ్యాస్ కొరతపై ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు.
  • గ్యాస్ కష్టాలు త్వరగా తొలగిపోవాలని ఉషా మల్పూరి ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని హోటల్స్ మూతపడగా, మరికొన్ని కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నాయి. ఈ సమస్యపై నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో గ్యాస్ కొరత తీవ్రత

Naga Shourya Mother : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకే రంగాన్ని నమ్ముకోకుండా సినిమా రంగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వివిధ రంగాలలో పెట్టబడులుగా పెడుతూ.. తమ ఆదాయాన్ని పెంచుకుంటూనే.. తమ ఉనికిని విస్తరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో చేస్తూనే.. మరొకవైపు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును అటు మల్టీప్లెక్స్ లలో ఇటు ఫుడ్డు రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు రెస్టారెంట్ బిజినెస్ లపై ఆసక్తి కనబరిస్తున్న విషయం తెలిసిందే.. ఇక వారిలో హీరో నాగశౌర్య తల్లి ప్రముఖ నిర్మాత ఉషా మల్పూరీ కూడా ఒకరు. ఒకవైపు చిత్రాలు నిర్మిస్తూనే మరొకవైపు రెస్టారెంట్లు నిర్వహిస్తూ మరింత బిజీగా మారిపోయారు.

అయితే ఇలాంటి సమయంలో గత కొన్ని వారాలుగా ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో వస్తువులు, ఇంధన సరఫరా కొంతమేరా ఆగిపోయింది . ఈ నేపథ్యంలోనే ఇండియాలో గ్యాస్ కొరత ఏర్పడడంతో గ్యాస్ ప్యానిక్ తో లక్షల సిలిండర్లు బుక్ అవడంతో కొన్ని హోటల్స్ గ్యాస్ లేక పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్ యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందక కొన్ని హోటల్స్ మూతపడగా.. మరికొన్ని కట్టెల పొయ్యిల పైనే వంటలు కానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో నాగ శౌర్య తల్లి ఉషా మల్పూరీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

తాజాగా ఉష మల్పూరీ సైతం తన రెస్టారెంట్లో కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారు. పొగ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని ఆమె చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరగా ఈ గ్యాస్ కష్టాలు తొలగిపోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాదులో ఏర్పడ్డ ఈ గ్యాస్ కొరత హోటల్ యజమానులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే గ్యాస్ కష్టాలను తొలగించాలని సదరు హోటల్స్ యాజమాన్యులు కోరుతున్నారు.. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కట్టెల పొయ్యిలపై వంటలతో ఇబ్బందులు

ఉష మల్పూరీ తన పేరు మీదనే “ఉషా మల్పూరీస్ కిచెన్” పేరుతో ఒక రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. రుచికరమైన , నాణ్యమైన ఆహారానికి ఈ రెస్టారెంట్ ప్రసిద్ధి చెందింది.. ముఖ్యంగా తన వంటకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు తాజాగా గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉషా మల్పూరి ఆవేదన, ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్‌లో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందక కొన్ని హోటళ్లు మూతపడగా, మరికొన్ని కట్టెల పొయ్యిలపైనే వంటలు కానిస్తున్నాయి. సినీ హీరో నాగశౌర్య తల్లి ఉషా మాల్పూరీ సైతం తన రెస్టారెంట్‌లో కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారు. పొగ వల్ల… pic.twitter.com/2Zi7HyIm3L

— ChotaNews App (@ChotaNewsApp) March 15, 2026

హైదరాబాద్‌లో గ్యాస్ కొరత హోటల్ యజమానులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్స్ యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.